దుందుభి వాగుపై రూ.20 కోట్ల హై లెవెల్ బ్రిడ్జికి శంకుస్థాపన
విశ్వంభర, నాగర్‌కర్నూల్: నాగర్‌కర్నూల్ నియోజకవర్గ పరిధిలోని తాడూరు మండలం సిర్సివాడ గ్రామం వద్ద దుందుభి వాగుపై రూ.20.20 కోట్ల వ్యయంతో నిర్మించనున్న హై లెవెల్ బ్రిడ్జి పనులకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ (సీతక్క) సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో నాగర్‌కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి, ఎమ్మెల్సీ డాక్టర్ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి పట్టుదలతో ఈ ప్రాంత ప్రజల దశాబ్దాల నాటి కల సాకారమవుతోందని ప్రశంసించారు. వంతెన నిర్మాణంతో నాగర్‌కర్నూల్, జడ్చర్ల ప్రాంతాల మధ్య రాకపోకలు సులభతరం కావడంతో పాటు వర్షాకాలంలో ప్రజలు ఎదుర్కొనే ఇబ్బందులు తొలగిపోతాయని తెలిపారు. మహిళల ఆర్థిక, సామాజిక, రాజకీయ సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి పేర్కొన్నారు. స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు, ఇందిరా మహిళా శక్తి భవనాల నిర్మాణం వంటి కార్యక్రమాల ద్వారా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు. నాగర్‌కర్నూల్ నియోజకవర్గ అభివృద్ధికి ఇప్పటికే పలు పనుల కోసం కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు వెల్లడించారు. ఎంపీ డాక్టర్ మల్లు రవి మాట్లాడుతూ ఈ వంతెన నిర్మాణం ప్రాంత ప్రజల చిరకాల కోరిక నెరవేరిన సందర్భంగా మంత్రి సీతక్కకు కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్సీ డాక్టర్ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి మాట్లాడుతూ 50 ఏళ్ల కల నేడు సాకారమైందని పేర్కొన్నారు. ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం సహకారంతో ఈ ప్రాజెక్టు సాధ్యమైందన్నారు. నాగర్‌కర్నూల్ అభివృద్ధికి మంత్రి సీతక్క ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అమరేందర్, దేవసహాయం, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.