నార్కట్పల్లి ప్రధాన రహదారి సమస్య పై కలెక్టర్ ను కలిసిన  బిజెపి  నాయకులు  రమేష్

 విశ్వంభర, నార్కెట్ పల్లి:  వర్షాకాలం ప్రారంభమైన దృష్ట్యా త్వరగా  నార్కెట్పల్లి పట్టణ ప్రధాన రహదారిని పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ను కలసి కోరడం జరిగింద ని, ఆయన సానుకూలంగా స్పందించిన   ఆర్ అండ్ బి అధికారులతో మాట్లాడి తొందరగా పూర్తి చేసేలా కృషి చేస్తానని  హామీ ఇచ్చారని  పాలకూరి రమేష్ తెలిపారు. నార్కట్‌పల్లిలో ఉన్న ప్రధాన రహదారి పూర్తిగా ధ్వంసం అయింది. 2021లో ఈ రహదారి మరమత్తు పనులు ప్రారంభించారు. ఇప్పటికి 5 సంవత్సరాలు కావస్తున్నది.  అయిన కానీ ఇంత వరకు  రహదారి పనులు పూర్తి కాలేదు. పనుల సగం చేసి మధ్యలో నిలుపుదల చేసినారు. రోడ్డు మొత్తం గుంతలుగా ఏర్పడి వాహనాల రాకపోకల తీవ్ర ఇబ్బందులు జరుగుతున్నాయి. ముఖ్యంగా నార్కట్‌పల్లి బస్టాండ్ నుండి నల్గొండ వెళ్ళే ప్రధాన మార్గంలో రోడ్డు తవ్వి, పనులు పూర్తి చేయకుండా అసంపూర్తి వదిలి వేసినారు. దీంతో వర్షాలు వచ్చినప్పుడు వర్షం నీరు నిలిచి, ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. నిత్యం ప్రమాదాలు జరుగుచున్నాయి. ప్రజలు చాలా ఇబ్బందులు పడుచున్నారు. నార్కట్‌పల్లికి నిత్యం వందలాది మంది పేద ప్రజలు బస్టాండ్ నుండి కామినేని హాస్పిటల్‌కు వస్తుంటారు. రోడ్డు సరిగ్గా లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

🕒 23 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/6a3a7f2dae3b3/article-17037

Tags: