పోలీసుల ఆధ్వర్యంలో డ్రగ్స్ నిరోధంపై అవగాహన
విశ్వంభర,ఇనుగుర్తి: డ్రగ్స్ దుర్వినియోగం, అక్రమ రవాణాకు వ్యతిరేకంగా ఇంటర్నేషనల్ డ్రగ్స్ డే ను పురస్కరించుకొని ఇనుగుర్తి ఎస్సై కరుణాకర్ ఆధ్వర్యంలో పోలీసులు స్థానిక హై స్కూల్ విద్యార్థులకు సోమవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ డ్రగ్స్ కు బానిసలయితే వ్యక్తిగతమైన జీవితాలతో పాటు కుటుంబాలు చిన్నాభిన్నమవుతాయని పెద్దలకు వివరించాలని విద్యార్థులకు ఉద్బోధించారు. మాదకద్రవ్యాలను అక్రమ రవాణాకు పాల్పడినా మీకు తెలిసిన వారు ఎవరైనా వాడినా టోల్ ఫ్రీ మొబైల్ నెంబర్ 1908 కి సమాచారం అందించాలని సూచించారు. కార్యక్రమంలో ఇన్చార్జి హెచ్ఎం అమ్మ యాకయ్య, స్టాఫ్ సెక్రటరీ సమ్మిరెడ్డి, ఉపాధ్యాయులు యాదగిరి,ప్రవీణ్, నారాయణ,దేవేందర్,ఉప్పలయ్య,యాకయ్య పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.