డ్రగ్స్ వాడకం దేశద్రోహమే: జిల్లా ఎస్పీ నరసింహ
విశ్వంభర,అనంతగిరి: యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలని, డ్రగ్స్ వినియోగం దేశద్రోహంతో సమానమని సూర్యపేట జిల్లా ఎస్పీ నరసింహ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మాదక ద్రవ్యాల నియంత్రణకు ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేక అవగాహన వారోత్సవాల భాగంగా మంగళవారం మండల కేంద్రంలోని అనురాగ్ ఇంజనీరింగ్ కళాశాలలో యాంటీ డ్రగ్ అవేర్నెస్ వీక్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ పాల్గొని మాట్లాడుతూ యువత గంజాయి, డ్రగ్స్ కు బానిసలై తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని కోరారు .మహిళలు, చిన్నారులపై జరిగే నేరాలకు డ్రగ్స్ వాడకమే ప్రధాన కారణమని గుర్తు చేశారు. యువతను డ్రగ్స్ కు దూరంగా ఉంచితేనే దేశానికి బంగారు భవిష్యత్తు ఉంటుందని డ్రగ్స్ వినియోగం దేశద్రోహంతో సమానమని అన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మాదకద్రవ్యాల వినియోగం పెరిగిందని తెలిపారు.డిమాండ్ లేకపోతే సప్లై ఉండదు కాబట్టి డ్రగ్స్ డిమాండ్ ను తగ్గించాల్సిన బాధ్యత సమాజంపై ఉందన్నారు. డ్రగ్ ను నియంతరించడానికి పోలీస్ వ్యవస్థ కృషి చేస్తుందని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా మాదకద్రవ్యాలు అక్రమ రవాణాని అరికట్టేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. సమాజంలో జరుగుతున్న నేరాలు ఎక్కువ శాతం డ్రగ్స్ కు అలవాటు పడిన యువత ద్వారానే జరుగుతున్నాయని అన్నారు. అనంతరం డ్రగ్స్ నియంత్రణకు విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి,సీఐ రామకృష్ణ రెడ్డి,పోలీస్ సిబ్బంది,అనురాగ్ కళాశాల యాజమాన్యం,అధ్యాకులు విద్యార్థిని,విద్యార్దులు తదితరులు పాల్గొన్నారు.