అశోక్ నగర్‌లో నిరుద్యోగుల మెరుపు ధర్నా
విశ్వంభర, అశోక్ నగర్ : త్యాగాలు మావి… భోగాలు మీవా” అంటూ నిరుద్యోగులు సోమవారం హైదరాబాదు అశోక్ నగర్ చౌరస్తాలో మెరుపు ధర్నాకు దిగారు. ఒక్కసారిగా రోడ్డుపైకి చేరుకుని చౌరస్తాలో బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొని, భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మెగా డీఎస్సీ ద్వారా 15 వేల పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన రెండు లక్షల ఉద్యోగాల హామీ ఏమైందని ప్రశ్నిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. జీవో నంబర్లు 46, 29లను రద్దు చేయాలని కూడా కోరారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు.