ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం  

ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం  

విశ్వంభర, హైదరాబాద్: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని భారతీయ యోగా సంస్థాన్ తూర్పు జిల్లా-6 ఆధ్వర్యంలో డీర్ పార్క్‌లో ఘనంగా నిర్వహించారు. డీర్ పార్క్ యోగా సభ్యులు, వాకర్స్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి డీఎస్పీ వెంకట్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన భగవద్గీత సారాంశాన్ని వివరిస్తూ, మనసుకు మనసే మిత్రుడని, శత్రువని, వైరాగ్యంతో మనసును జయించవచ్చని అన్నారు. సనాతన ధర్మ గొప్పతనాన్ని వివరించిన ఆయన, తల్లిదండ్రులను గౌరవించడం ప్రతి ఒక్కరి ధర్మమని పేర్కొన్నారు. సంపద, అధికారం కంటే తోటి మనుషులకు సహాయం చేసే వ్యక్తే నిజమైన శక్తివంతుడని అన్నారు. తూర్పు జిల్లా-6 అధ్యక్షులు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ యోగాకు ఆద్యుడైన పతంజలి మహర్షిని స్మరించుకున్నారు. అంతర్జాతీయ స్థాయిలో యోగాకు గుర్తింపు తీసుకొచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఓంకార సాధన, సూర్యనమస్కారాలు, యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యానం నిర్వహించారు. యోగాసనాలతో కూడిన నృత్య ప్రదర్శన చేసిన డాక్టర్ రమాదేవి, లావణ్యలను పలువురు అభినందించారు. ప్రభు చరణ్ గౌడ్ దైవభక్తి గీతాలతో ఆకట్టుకున్నారు. వాగ్దేవి జోన్ చీఫ్ వేణుగోపాల్ రెడ్డి స్వాగతోపన్యాసంతో ప్రారంభమైన కార్యక్రమాన్ని జిల్లా కార్యదర్శి ప్రభాకర్ సమన్వయం చేశారు. జోనల్ చీఫ్‌లు, కార్యదర్శులు, సెంటర్ ఇన్‌చార్జిలు, యోగా సాధకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమం విజయవంతానికి సహకరించిన డీర్ పార్క్ వాకర్స్ అసోసియేషన్, యోగా సాధకులు, దాతలకు సెంటర్ ఇన్‌చార్జి జగదీశ్ యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు.

🕒 23 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/happy-international-yoga-day/article-17035

Tags: