పల్స్ పోలియో, జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమాలను విజయవంతం చేయాలి
- జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్
విశ్వంభర , మహబూబాబాద్: జిల్లాలో పల్స్ పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమం, జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ అధికారులను ఆదేశించారు. సోమవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. జూన్ 28న పల్స్ పోలియో బూత్ డే నిర్వహించి, జూన్ 29, 30 తేదీల్లో ఇంటింటి సర్వే చేపట్టనున్నట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని 0 నుంచి 5 సంవత్సరాల లోపు ప్రతి చిన్నారికి పోలియో నిరోధక రెండు చుక్కల మందు అందించడమే లక్ష్యమని పేర్కొన్నారు. ఇందుకోసం పోలియో బూత్‌లు, మొబైల్ బృందాలు, ట్రాన్సిట్ పాయింట్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. వలస కూలీల పిల్లలు, పట్టణ మురికివాడలు, నిర్మాణ స్థలాల్లో నివసించే పిల్లలు, గతంలో పోలియో చుక్కలు వేయించని చిన్నారులపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. పంచాయతీ కార్యదర్శులు, అంగన్‌వాడీ సిబ్బంది, వార్డు సభ్యులు సమన్వయంతో పనిచేసి ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లలో ట్రాన్సిట్ బృందాలను ఏర్పాటు చేసి ప్రయాణికుల పిల్లలకు కూడా పోలియో చుక్కలు అందించాలని చెప్పారు. అనంతరం జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం నిర్వహణపై సమీక్షిస్తూ, జూలై 13న ప్రధాన కార్యక్రమం, జూలై 20న మాప్-అప్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలోని 1 నుంచి 19 సంవత్సరాల వయస్సు గల పిల్లలు, కిశోరులకు అల్బెండాజోల్ మాత్రలు పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. నులిపురుగుల వల్ల కలిగే రక్తహీనత, పోషకాహార లోపం, ఎదుగుదల సమస్యలను నివారించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. 1 నుంచి 2 సంవత్సరాల పిల్లలకు అర మాత్ర, 2 సంవత్సరాలు పైబడిన వారికి పూర్తి మాత్ర ఇవ్వాలని, 3 సంవత్సరాలు దాటిన పిల్లలు మాత్రను నమిలి మింగేలా చూడాలని సూచించారు. మండల స్థాయిలో ఎంపీడీవోలు, ఎంపీఓలు, ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులు, ఆరోగ్య, మహిళా శిశు సంక్షేమ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఆదేశించారు. పల్స్ పోలియో, నులిపురుగుల నివారణ కార్యక్రమాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు కొత్తగా ఎన్నికైన సర్పంచులు, వార్డు సభ్యులు, కౌన్సిలర్లు భాగస్వాములు కావాలని సూచించారు. ప్రధాన కూడళ్లు, ప్రజలు అధికంగా సంచరించే ప్రాంతాల్లో ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేయడంతో పాటు సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించాలని తెలిపారు. అలాగే ఆసుపత్రుల్లో పారిశుధ్యానికి అత్యున్నత ప్రాధాన్యం ఇవ్వాలని, రోగులకు అవసరమైన పరీక్షలు క్రమం తప్పకుండా నిర్వహించాలని, బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణలో నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కె. అనిల్ కుమార్, ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పురుషోత్తం, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. రవి రాథోడ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.