బొంపల్లి గ్రామంలో డ్వాక్రా భవన నిర్మాణానికి శంకుస్థాపన
విశ్వంభర, దోమ: మండల పరిధిలోని బొంపల్లి గ్రామంలో ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మంజూరు చేయించిన డ్వాక్రా మహిళా భవనం నిర్మాణానికి మండల పిఎసిఎస్ చైర్మన్ యాదవ రెడ్డి స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులతో కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా యాదవ రెడ్డి మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరంగా కృషి చేస్తుందన్నారు. గ్రామాలు దేశానికి పట్టుకొమ్మలని గ్రామ అభివృద్ధి తోనే దేశ అభివృద్ధి సాధ్యపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ విజయ పవన్, మాజీ సర్పంచ్ సురేష్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు అంతిరెడ్డి, రాఘవేందర్ రెడ్డి, భాస్కర్, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.