ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో ఏసీపీ తనిఖీలు
విశ్వంభర, సిద్దిపేట: ట్రాఫిక్ ఏసీపీ సుమన్ కుమార్ సిద్దిపేట ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌ను మంగళవారం తనిఖీ చేశారు. స్టేషన్‌లోని వసతులు, సిబ్బంది పనితీరు, రికార్డుల నిర్వహణను పరిశీలించారు. ట్రాఫిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ కార్యకలాపాలు, ట్రాఫిక్ నిర్వహణ ఏర్పాట్ల గురించి అడిగి తెలుసుకున్నారు. వివిధ సాంకేతిక పరికరాల పనితీరును పరిశీలించారు. పట్టణంలో ట్రాఫిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ను మరింత బలోపేతం చేయాలని సిబ్బందిని ఆదేశించారు. రోడ్డు భద్రతా చర్యలు చేపట్టి ప్రమాదాల నివారణకు కృషి చేయాలని, పెండింగ్ పనులను సత్వరం పరిష్కరించాలని సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. స్టేషన్ రికార్డుల నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేసి, స్టేషన్ పరిసరాల పరిశుభ్రతను నిరంతరం కాపాడుకోవాలని సూచించారు.