ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి

ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి

  • ఎస్పీ నరసింహ 

 విశ్వంభర, సూర్యాపేట: పోలీసు ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పి నరసింహ జిల్లా పోలీస్ కార్యాలయం నందు పిర్యాదుదారులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుండి వచ్చిన పిర్యాదుదారుల నుండి పిర్యాదులు స్వీకరించారు. ప్రజల సమస్యల పరిష్కారానికై సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా తక్షణ ఆదేశాలు, సూచనలు చేసి సమస్యల పరిష్కారానికి అవసరమైన దిశానిర్దేశం చేశారు. ప్రజల సమస్యలపై త్వరితగతిన చట్టపరమైన చర్యలు తీసుకుని బాధితులకు బరోసా కల్పించాలి అన్నారు. ఎలాంటి సమస్యలు ఉన్న ప్రజలు పైరవీలు లేకుండా, మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా, నిర్భయంగా పోలీస్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. చట్టబద్ధమైన విధానంలోనే ప్రజలకు న్యాయం జరుగుతుందని, శాంతి భద్రతలను కాపాడుతూ ప్రజలకు మరింత చేరువగా ఉండడమే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని తెలిపారు.

Tags:  

Advertisement

LatestNews

.పేదలకు ఇందిరమ్మ ఇండ్లు గొప్ప వరం  -- మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు...- ఇందిరమ్మ ఇల్లు ప్రారంభోత్సవం. - ఘనంగా బాబు జగ్జీవన్ రామ్  జయంతి 
చలివేంద్ర ప్రారంభం – ప్రజలకు సేవే లక్ష్యంగా బీజేపీ నాయకులు*
సాంప్రదాయ దినోత్సవం ఘనంగా.. చైతన్య విశ్వవిద్యాలయంలో సంస్కృతి సందడి
ఒలింపియాడ్ ఫలితాల్లో ఎర్రగట్టు గుట్ట బ్రాంచ్ షైన్ విద్యార్థుల ప్రభంజనం.. సెక్రటరీ జక్కుల శ్రీనివాస్ యాదవ్ వెల్లడి
అంగరంగ వైభవంగా క్రీస్తుజ్యోతి ప్రార్థన మందిరంలో గుడ్ ఫ్రైడే వేడుకలు..పాస్టర్ రెవరండ్ గోపు జయప్రకాష్ వెల్లడి
విలాసారం సంధ్యారాణి కి పితృవియోగం.-సంధ్యారాణి కుటుంబానికి నేషనల్ హ్యూమన్ రైట్స్ చిల్డ్రన్ ఎంపవర్మెంట్ ఆర్గనైజేషన్ అండగా ఉంటుంది. 
ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక గ్రామసభలు