సామాజిక రథ యాత్రకు ఎంపీ ఈటల మద్దతు
గన్ పార్క్ నుండి యాత్రను ప్రారంభించిన - RLD అధ్యక్షులు - కపిలవాయి దిలీప్ కుమార్ -
On
విశ్వంభర, హైదరాబాద్ :-నేటి నుండి 23.10.2025 మ: 12:00 గం లకు రాష్ట్రీయ లోక్ దళ్ అధ్యక్షులు , మాజీ ఏం.ఎల్.సి కపిలవాయి దిలీప్ కుమార్ సామాజిక రథ యాత్ర ను గన్ పార్క్ హైదరాబాద్ నుండి ఈటల రాజేందర్ పార్లమెంట్ సభ్యులు ప్రారంభించారు. ఈటల మాట్లాడుతూ తెలంగాణ సమాజం లో 90% ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు ఇప్పటికీ రాజ్యాధికారం దక్కటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వర్గాలను చైతన్య వంతులను చేయటానికి సంకల్పించిన దిలీప్ కుమార్ యాత్ర కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ గాలి వినోద్ మాటలాడుతూ దిలీప్ కుమార్ మొదటి నుంచి బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచిన తెలంగాణ ఉద్యమకారుడు అని ఆయన సంకల్పించిన సామాజిక చైతన్య రథ యాత్ర ద్వారా బహుజనులు ఏకం కావాలని పిలుపునిచ్చారు. చిరంజీవులు మాజీ ఐఏఎస్ మాట్లాడుతూ అన్ని ప్రభుత్వాలలో బీసీలకు తీరని అన్యాయం జరిగింది అని బహుజనులు ఏకమై రాజ్యధికారాన్ని చేపట్టితే తప్ప న్యాయం జరగదని పేరుకొన్నారు. విమలక్క మాట్లాడుతూ అప్పటి టీ ఆర్ ఎస్ హయాము లో తెలంగాణ దోపిడీకి గురి అయితే అంతకంటే ఎక్కువ దోపిడికి ప్రస్తుత రేవంత్ రెడ్డి కాంగ్రెస్ హయాం లో గురి అవుతుంది అని అన్నారు. ప్రొఫెసర్ లక్ష్మణ్ మాట్లాడుతూ దిలీప్ ఢిల్లీ లో కూడా తెలంగాణ సాధనకు అన్ని పార్టీలతో లాబీయింగ్ చేసిన వాడు అని కులాలకు అతీతంగా సామాజిక స్పృహ ఉన్నవాడని ఇప్పుడు కూడా తాను ఏం ఎల్ ఏ. ఏం పి పదవులకు పోటీ చేయకుండా సామాజిక చైతన్యానికి నడుము కట్టడం అభినందనీయం అని అన్నారు. ఇందిరా రాష్ట్రీయ లోక్ దళ్ జాతీయ మహిళా అధ్యక్షురాలు మాట్లాడుతూ ఈ చైతన్య యాత్ర ఉద్దేశం బడుగు బలహీన వర్గాలను ఏకం చేయటం వారు రాజ్యాధికారం చేపట్టటం అని చెప్పారు. యువతా మేలుకో తెలంగాణ ఏలుకో అని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమములో వివిధ ప్రజా సంఘాల నాయకులతో పాటు టీ.ఆర్.ఎల్.డి రాష్ట్ర నాయకులు గిరి కుండే, మల్లేష్ ముద్దం, సిద్ధం కుమార్, రిషబ్ జైన్, ప్రసాద్, జాని, బుల్లెట్ వెంకన్న కళ బృందం పాలుగొన్నారు.



