ప్రజావాణి ఫిర్యాదులను సత్వరం పరిష్కరించాలి

ప్రజావాణి ఫిర్యాదులను సత్వరం పరిష్కరించాలి

  • సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

 విశ్వంభర,సూర్యాపేట: ప్రజావాణి పిర్యాదులపై అధికారులు సత్వరమే చర్యలు తీసుకొని పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆదేశించారు.సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశం మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజల నుండి ఆర్జీలను స్వీకరించారు. ప్రజావాణి కార్యక్రమానికి అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని,  వివిధ శాఖలలో చాలా కాలం పెండింగ్ లో ఉన్న పిర్యాదులపై శాఖల వారీగా ప్రత్యేక శ్రద్ద పెట్టి పరిష్కరించాలని, రాష్ట్ర స్థాయి ప్రజావాణి పెండింగ్ దరఖాస్తులను కూడా పరిష్కరించాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమం లో భూ సమస్యలకి సంబందించి 48 దరఖాస్తులు, జిల్లా పంచాయతీ అధికారి 8, వైద్య ఆరోగ్య శాఖ అధికారి 7,  డి ఆర్ డి ఓ  6 మిగిలిన 30 దరఖాస్తులు వివిధ శాఖలకి చెందినవని, మొత్తం 99 దరఖాస్తులు వచ్చాయాని, వాటిని పరిష్కరించేందుకు శాఖల వారీగా పంపించటం జరిగిందని కలెక్టర్  అన్నారు. ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్ కే. సీతారామారావు , మహిళా, శిశు  సంక్షేమ అధికారి  కే. నర్సింహారావు,,డి ఎస్ సి డి ఓ కే. దయానంద రాణి,,డి ఈ ఓ ఆశోక్, ట్రైబల్ వెల్ఫేర్ అధికారి  శంకర్, పశుసంవర్ధక శాఖ అధికారి శ్రీనివాస్  అధికారులు, సిబ్బంది, తదితరులు హాజరైనారు.

Tags: