ఆర్జిత సెలవులు మంజూరు చేయాలని వినతి

ఆర్జిత సెలవులు మంజూరు చేయాలని వినతి

విశ్వంభర,నెల్లికుదురు: ఉపాధ్యాయులకు గత వేసవి సెలవుల్లో జరిగిన శిక్షణ తరగతులకు ఆర్జిత సెలవులు మంజూరు చేయాలని
డీటీఎఫ్ మండలాధ్యక్షులు మండల రాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు మండల కేంద్రం నెల్లికుదురులోని ఎమ్మార్సీ భవనంలో సోమవారం ఎంఈఓ రాందాస్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికలలో  సెలవు దినాలయిన జనవరి 10, 11 తేదీల తోపాటు,రెండవ దఫా జరిగిన ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉపాధ్యాయిని,ఉపాధ్యాయులకు కంపెన్సేటరీ క్యాజువల్ లీవ్(సీసీఎల్) మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలోడీటీఎఫ్ సభ్యుడు  ఉపేందర్ పాల్గొన్నారు.

Tags: