శ్రీకారం పేరుతో పోలీసులకు ప్రత్యేక శిక్షణా తరగతులు 

 శ్రీకారం పేరుతో పోలీసులకు ప్రత్యేక శిక్షణా తరగతులు 

విశ్వంభర, సిటీ పోలీస్ కమిషనరేట్ :-హైదరాబాద్ సిటీ పోలీస్ శాఖలో సిబ్బంది నైపుణ్యాలను అభివృద్ధి చేసి ప్రజాసేవను మరింత మెరుగుపరిచే లక్ష్యంతో   'ఒక గొప్ప మార్పునకు ఇదే శ్రీకారం" పేరుతో ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని పోలీసు కమిషనరేట్ లో నవంబర్ 18 నుండి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా డిజిపి సౌత్ జోన్  స్నేహమేహర చలపుర ట్రైనింగ్ సెంటర్లోని  శిక్షణ తరగతులను పరిశీలించి క్షేత్రస్థాయి పోలీస్ సిబ్బందితో పోలీస్ సింగ్ లో జరుగుతున్న మార్పులకు అనుగుణంగా ప్రతి పోలీస్ సిబ్బంది ప్రొఫెషనల్ నైపుణ్యాలు అరవర్చుకోవాలని, ఉద్యోగ జీవితంలో శిక్షణ కీలక పాత్ర పోషిస్తుందని,ట్రైనింగ్ ద్వారా కొత్త విషయాలు నేర్చుకుని సేవ ప్రమాణాలను మరింత మెరుగుపరచుకోవచ్చని, ప్రజల్లో పెరుగుతున్న చైతన్యం దృష్టియా పోలీసుల ప్రవర్తన,స్పందన,సేవా ధోరణిలో మరింత మెరుగుదల అవసరమని పేర్కొన్నారు. పోలీసింగ్  లో సిబ్బంది సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారం కోసం శాఖ తరపున కృషి చేస్తామని తెలిపారు.సిబ్బంది ఆర్థిక మరియు ఆరోగ్య పరిరక్షణ కుటుంబ సంక్షేమంపై దృష్టి పెట్టడం కూడా ఎంతో అవసరమని తెలిపారు.ఇలాంటి ప్రయోజనకరమైన నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాన్ని రూపొందించి అమలు చేస్తున్న హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్  విసి సజ్జనార్ కి డీసీపీ స్నేహమేహర ధన్యవాదాలు తెలిపారు. ఈ శిక్షణా కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ మొగల్పుర శీను, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్లు మొగల్పుర అశోక్, శాలిబండ పోలీస్ స్టేషన్ చంద్రశేఖర్, ఛత్రినాక డివిజన్ సిబ్బంది పాల్గొన్నారు.

Tags: