క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం
On
విశ్వంభర, సిద్దిపేట: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాల సందర్భంగా జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో కాంగ్రెస్ నాయకులు క్రికెట్ టోర్నమెంట్‌ను శుక్రవారం ప్రారంభించారు. టోర్నమెంట్ యూత్ కాంగ్రెస్ సెక్రటరీ బొమ్మల ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో మొదలైంది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూజల గోపికృష్ణ ముఖ్య అతిథిగా హాజరై టాస్ వేసి క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన క్రీడాకారులను అభినందిస్తూ క్రీడాస్ఫూర్తితో పోటీపడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బొమ్మల యాదగిరి, కలీముద్దీన్, కౌన్సిలర్ పయ్యావుల ఎల్లం యాదవ్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ముద్దం లక్ష్మి, రాజిరెడ్డి, రాజ బహుదూర్ రెడ్డి, చాంద్, కొత్త మహిపాల్ రెడ్డి, ఎర్ర మహేందర్, చిన్నకోడూరు ఎఎంసీ వైస్ ఛైర్మన్ బుస్సా రాజశేఖర్, రాజిరెడ్డి, రాకేశ్ తదితరులు పాల్గొన్నారు.



