సీఎం రేవంత్‌రెడ్డివి పచ్చి అబద్ధాలు

సీఎం రేవంత్‌రెడ్డివి పచ్చి అబద్ధాలు

విశ్వంభర, సిద్దిపేట: సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేటకు నిధులు విడుదల చేయకుండా, అబద్ధాలతో ప్రజలను తప్పుదోవ పట్టించారని బీఆర్‌ఎస్‌వీ జిల్లా అధ్యక్షుడు రెడ్డి యాదగిరి, సమన్వయకర్త ఇరుగంటి రమేశ్ అన్నారు. నంగునూరు మండలం నర్మెటలోని ఆయిల్‌ఫామ్ ఫ్యాక్టరీ వద్ద సంఘం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు చిత్రపటాలకు పాలాభిషేకం చేసి సీఎం సభాస్థలిని శుద్ధి చేసే కార్యక్రమం చేపట్టారు. పోలీసులు నాయకులను సభా ప్రాంగణంలోకి అనుమతించకుండా అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ,  గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం హయాంలోనే కేసీఆర్, హరీశ్‌రావు కృషి వల్ల ఆయిల్‌ఫామ్ ఫ్యాక్టరీ స్థాపించినట్టు తెలిపారు. ప్రస్తుత సీఎం కేవలం ప్రారంభోత్సవానికి మాత్రమే వచ్చారని, ఎటువంటి కొత్త నిధులు విడుదల చేయలేదని ఆరోపించారు. నిరసనలో బీఆర్ఎస్‌వీ నంగునూరు మండల సమన్వయకర్త పర్శరాములు, దాసరి రమేశ్, రంగు చింటు, ఎండీ.గపూర్, కిరణ్ గౌడ్, పెర్క మధు, అనిల్ రెడ్డి, శ్రావణ్ గౌడ్, మద్దూరి రాజు, సంపంగి శ్రీకాంత్, రజినీకాంత్, తదితరులు పాల్గొన్నారు.

Tags: