టిసిసి రాష్ట్ర అధ్యక్షునికి  ఘన సన్మానం 

టిసిసి రాష్ట్ర అధ్యక్షునికి  ఘన సన్మానం 

విశ్వంభర, బషీర్ బాగ్ : ముది రాజ్ లు విద్యా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదిగినప్పుడే అన్ని రంగాలలో అభివృద్ధి చెంది చైతన్యవంతులు అవుతారని తెలంగాణ శాసనమండలి డిప్యూటీ స్పీకర్, మాజీ రాజ్యసభ సభ్యులు  డాక్టర్ బండ ప్రకాష్ అన్నారు.  ముదిరాజుల అచీవ్మెంట్ అవార్డ్స్ ప్రతిభ పురస్కార అభినంద సత్కార సభలో ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రసంగించారు.ఈ సందర్భంగా గత నలభై సంవత్సరాలుగా  సమాజ అభివృద్ధి  సంక్షేమ అభివృద్ధిలో నిరంతరం ఎనలేని కృషి చేస్తున్న, ఇటీవలే అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సస్లో లో అవార్డు పొందిన తెలంగాణ రాష్ట్ర  మేధావుల ఫోరం  శాఖ  తెలంగాణ సిటిజన్స్ కౌన్సిల్ అధ్యక్షులు డాక్టర్ రాజ్ నారాయణ ముదిరాజ్ ముదిరాజ్ కు శాలువా మెమొంటో పూలమాలతో ఘనంగా సన్మానించారు. గత 40 సంవత్సరాలుగా పర్యావరణ పరిరక్షణ, శాంతి స్థాపన, జాతీయ సమైక్యత, మహిళల యువజన, విద్యార్థి సంక్షేమ అభివృద్ధి కొరకు నిరంతరం పాటుపడుతూ కిడ్నీ, గుండె, ఎయిడ్స్, క్షయ, క్యాన్సర్, మాదకద్రవ్యాల వ్యతిరేకం, సైన్స్ అండ్ టెక్నాలజీలో, కాలుష్య నివారణ తదితర అంశాలలో సదస్సులు ర్యాలీలు, అవగాహన శిబిరాలు నిర్వహించి రాష్ట్ర గవర్నర్లు, ముఖ్యమంత్రిలు, హైకోర్టు న్యాయమూర్తులు,రాష్ట్ర కేంద్ర మంత్రివర్యులు ద్వారా ఎన్నో అవార్డులు పొంది ప్రశంసలు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు శ్రీ పి చంద్రశేఖర్, తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ బుర్ర జ్ఞానేశ్వర్, తెలంగాణ వేదిక్ మ్యాస్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు మరియు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ డాక్టర్ బి సాయికిరణ్, కూలీ సమాజ్ ఢిల్లీ సంఘం జాతీయ అధ్యక్షులు రూటం  భూపతి , ప్రొఫెసర్ రాములు,ట్రస్ట్ లయన్ కోడివేల హనుమంతరావు,  శాతవాహన యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ ఉమేష్,వివిధ యూనివర్సిటీ ప్రొఫెసర్లు, డాక్టర్లు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు ఈ సన్మానంలో పాల్గొని డాక్టర్ రాజ్ నారాయణ ముదిరాజ్ కు అభినందనలు తెలిపారు.

Tags: