నాంపల్లి గాంధీజీ లో ఘనంగా ముందస్తు బతుకమ్మ సంబరాలు. -ట్రస్మా జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కోడి శ్రీనివాసులు
సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ
- బతుకమ్మ ఆటపాటలతో ఆకట్టుకున్న నాంపల్లి గాంధీజీ చిన్నారులు
విశ్వంభర, నాంపల్లి : ముందస్తు బతుకమ్మ సంబరాలను నాంపల్లి మండల కేంద్రంలోని గాంధీజీ విద్యాసంస్థల్లో ఘనంగా జరుపుకున్నారు. ముందుగా ఈ కార్యక్రమంలో ట్రస్మా జిల్లా అధ్యక్షులు, గాంధీజీ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు గౌరీదేవికి పూలమాలలు వేసి, పూజలు చేసి బతుకమ్మ వేడుకలు ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ కోడి శ్రీనివాసులు మాట్లాడుతూ బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి మరియు సాంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని, ఈ పండుగను తెలంగాణ ఆడపడుచులు వారి పుట్టింటిలో ఘనంగా జరుపుకుంటారని అన్నారు. ప్రకృతిని ఆరాధిస్తూ... బంధాలు మరియు అనుబంధాలను గుర్తు చేసుకుంటూ.... ఆడపడుచులు తొమ్మిది రోజులపాటు పూలతో గౌరీదేవిని పూజిస్తారని, మహాలయ అమావాస్య నాడు ఎంగిలిపూల బతుకమ్మగా ప్రారంభమై చివరి రోజు సద్దుల బతుకమ్మగా ముగుస్తుందని తెలిపారు. విద్యార్థినులు మహిళా ఉపాధ్యాయులు సాంప్రదాయ వస్త్రధారణతో, పూలతో అలంకరించుకొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. రంగురంగుల బతుకమ్మలతో పాటలు పాడుతూ, నృత్యాలు చేశారు. బతుకమ్మ పండుగ పర్యావరణాన్ని ఆదరించే ఆచారానికి ప్రతీక అని పేర్కొన్నారు. సత్యం చెడుపై గెలిచే విజయదశమి సందేశం చక్కగా వివరించారు. గౌరీ మాత వేషధారణలో ఉన్న చిన్నారులు ఆకర్షించారు.
ఈ కార్యక్రమంలో గాంధీజీ విద్యాసంస్థల డైరెక్టర్లు కర్నాటి నాగరాజు, సరికొండ వెంకన్న, ప్రిన్సిపల్స్ సామల వెంకటేశ్వర్లు, చిలుకూరి రామేశ్వరి, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.