అధిక లోడుతో వెళ్తున్న టిప్పర్లను నిలిపివేయాలని నిరసన
విశ్వంభర, చింతపల్లి: చింతపల్లి గ్రామం మీదుగా అధిక బరువుతో మట్టి తరలిస్తున్న టిప్పర్లను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం బిజెపి, బీఆర్ఎస్ నాయకులు ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టి తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. నాగర్‌కర్నూల్ జిల్లా చారగొండ ప్రాంతం నుంచి ఇటుక బట్టీలకు మట్టిని తరలిస్తున్న టిప్పర్లు అధిక లోడుతో చింతపల్లి గ్రామం మీదుగా ప్రయాణిస్తున్నాయని నాయకులు తెలిపారు. ఈ టిప్పర్ల రాకపోకల వల్ల గ్రామంలోని బీటీ రోడ్లు తీవ్రంగా దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా టిప్పర్ల వెనుక నుంచి ఎగిసిపడుతున్న ధూళి, దుమ్ము కారణంగా గ్రామస్తులు, ద్విచక్ర వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రమాదాలు కూడా చోటు చేసుకుంటున్నాయని పేర్కొన్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి అధిక లోడ్ టిప్పర్ల రాకపోకలను నిలిపివేసి, నిర్వాహకులపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా చింతపల్లి తహసీల్దార్‌తో పాటు ఎస్సైకు కూడా వినతిపత్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శివర్ల రమేష్, బీఆర్ఎస్ జిల్లా నాయకుడు ఎల్లంకి అశోక్, ఎర్ర వెంకటయ్య, నల్ల శంకర్, ఉప్పల యాదయ్య, సోమరాజు ప్రదీప్, శ్యామ్, కడారి సత్యం యాదవ్, గజ్జ అభినవ్, అక్కోజీ, కొప్పుల మహేష్, చంద్రశేఖర్, గడ్డి మహేందర్, కొప్పర శివ, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.