కౌలు రైతుల సమస్యలపై తక్షణ చర్యలు అవసరం

కౌలు రైతుల సమస్యలపై తక్షణ చర్యలు అవసరం

విశ్వంభర, హైదరాబాదు : కౌలు రైతులకు గుర్తింపు ఇవ్వడం ఆలస్యం చేయకూడదు ,  2011 భూ కౌలుదారుల చట్టాన్ని వెంటనే అమలు చేయాలని జస్టిస్ సుదర్శన్ రెడ్డి అన్నారు. మంగళవారం హైదరాబాదు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్‌లో జరిగిన కౌలు రైతుల సర్వే నివేదిక విడుదల కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కౌలు రైతులు గుర్తింపు లేక పథకాల ప్రయోజనాలకు దూరమవుతు న్నారని, వారి సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని సూచించారు. సంబంధిత మంత్రులతో సమావేశం ఏర్పాటు చేసి నివేదికలోని అంశాలను చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ కౌలు రైతుల సమస్యలు ఆర్థిక, సామాజిక కోణాల్లో తీవ్రంగా ఉన్నాయని పేర్కొన్నారు. విస్సా కిరణ్‌కుమార్ ఈ సీజన్ నుంచే గుర్తింపు కార్డులు జారీ చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ కౌలు రైతుల గుర్తింపు సాధన కమిటీ 22 జిల్లాల్లో 47 మండలాలు, 57 గ్రామాల్లో 1816 మంది రైతులను ఇంటర్వ్యూ చేసి నివేదిక రూపొందించింది. శ్రీహర్ష తన్నేరు వివరాలను సమర్పించారు. ఎం. కోదండరెడ్డి కౌలు రైతుల సమస్యలను పరిగణనలోకి తీసుకుని చర్యలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కన్నెగంటి రవి, డా. రుక్మిణి రావు, ఆకునూరి మురళి, జస్టిస్ చంద్రకుమార్, బి. కొందల్ రెడ్డి, పి. శంకర్, ఎం. వెంకటయ్య, చుక్కమ్మ, ఎం. జనార్దన్, విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.

🕒 10 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/immediate-action-is-needed-on-the-problems-of-tenant-farmers/article-16384

Tags: