డ్రగ్స్‌ నివారణపై పోలీసుల అవగాహన కార్యక్రమం

విశ్వంభర, అంబర్‌పేట : మాదకద్రవ్యాలకు దూరంగా ఉండటం సమాజ ఆరోగ్యానికి అవసరమని అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ జె. నర్సయ్య అన్నారు. సోమవారం సాయంత్రం హైదరాబాదు అంబర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎంసిహెచ్ గ్రౌండ్‌లో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో స్టేషన్ హౌస్ ఆఫీసర్ టి. కిరణ్ కుమార్, సబ్‌ఇన్‌స్పెక్టర్ ఐ. తరుణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మాదకద్రవ్యాల వినియోగం వల్ల వ్యక్తిగత ఆరోగ్యం, కుటుంబ వ్యవస్థ, సమాజంపై తీవ్ర ప్రతికూల ప్రభావాలు పడతాయని వివరించారు. డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని సూచించారు. యువతపై ప్రత్యేక దృష్టి పెట్టి, కుటుంబ సభ్యులు కూడా అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా మాదకద్రవ్యాలకు బానిసవుతుంటే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. సమాజం మొత్తం కలిసికట్టుగా పనిచేస్తేనే డ్రగ్స్ నిర్మూలన సాధ్యమవుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలు డ్రగ్స్ నిర్మూలనలో పోలీసు శాఖ చేపడుతున్న చర్యలకు తమ సహకారం అందిస్తామని తెలిపారు.

🕒 23 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/police-awareness-program-on-drug-prevention/article-16971

Tags: