ముషీరాబాదు అభివృద్ధికి రూ. కోటి 91 లక్షలు

విశ్వంభర, హైదరాబాదు : ప్రజా సంక్షేమం లక్ష్యంగా ముషీరాబాదు నియోజకవర్గంలో కోటి 91 లక్షలతో పలు అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే ముఠా గోపాల్ తెలిపారు. “ప్రజా సంక్షేమమే మా లక్ష్యం. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. “ప్రాంత అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ ప్రతి బస్తీకి అవసరమైన పనులను దశలవారీగా చేపడుతున్నాం. ప్రజల అవసరాలు తీర్చడమే మా ప్రధాన కర్తవ్యమన్నారు. సోమవారం ముషీరాబాదు నియోజకవర్గంలోని కవాడిగూడ డివిజన్‌లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కవాడిగూడ కొత్త బజార్‌లో రూ.47 లక్షలతో సీసీ రోడ్డు, బండ మైసమ్మ నగర్ బస్తీ కమ్యూనిటీ హాల్‌లో రూ.14 లక్షలతో టాయిలెట్లు, ఇందిరా పార్కులో రూ.81 లక్షలతో చిన్నారుల ఆట స్థలం, దోమలగూడలో వాల్మీకి మెహతర్ సమాజ్ స్మశానవాటికలో రూ.49 లక్షలతో అభివృద్ధి పనులను ప్రారంభించారు. ప్రాంత ప్రజలకు మెరుగైన సదుపాయాలు అందించడమే లక్ష్యంగా ఈ పనులు చేపట్టినట్లు తెలిపారు. మౌలిక వసతుల విస్తరణతో బస్తీల్లో నివసించే ప్రజలకు ఉపయోగం చేకూరుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో: ముఠా జయసింహ రమేష్ రామ్, వెంకటేష్ నాయకుడు మాజీ కార్పొరేటర్ రచన శ్రీ జే సురేందర్ నాయకుడు దీపక్ పప్పు నాయకుడు బాబూలాల్ నాయకుడు టి సుభాష్ అధ్యక్షుడు డి సుభాష్ అధ్యక్షుడు రాజేష్ నాయకుడు రాకేష్ నాయకుడు రాజు నాయకుడు రాజేందర్ నాయకుడు ముచ్చ కుర్తి ప్రభాకర్ నాయకుడు పాల్గొన్నారు.

🕒 23 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/91-lakh-crore-for-the-development-of-mushirabad/article-16995

Tags: