హుస్నాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా వెన్న రాజు
విశ్వంభర, హుస్నాబాద్ : హుస్నాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా వెన్న రాజు, హుస్నాబాద్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా వడ్డేపల్లి వెంకటరమణలను టీపీసీసీ అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్ నియమించారు. ఈ సందర్భంగా ఇద్దరు నాయకులు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. తమ నియామకానికి సహకరించిన రాష్ట్ర మంత్రి, స్థానిక ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో లేని సమయంలో కూడా పార్టీ బలోపేతానికి వెన్న రాజు, వడ్డేపల్లి వెంకటరమణలు అంకితభావంతో పనిచేశారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వెన్న రాజు తన స్వగ్రామమైన మాలపల్లిలో తన సతీమణి వెన్న స్వర్ణలతను కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టి గెలిపించుకున్నారు. అలాగే నియోజకవర్గ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కృషి చేశారు. మరోవైపు హుస్నాబాద్ మున్సిపల్- 2026 ఎన్నికల్లో వడ్డేపల్లి వెంకటరమణ కీలక పాత్ర పోషించారు. మున్సిపాలిటీలో 20 వార్డుల్లో 16 స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించారు. ఆయన చేసిన సేవలను గుర్తించిన పార్టీ అధిష్టానం ఈ బాధ్యతలను అప్పగించినట్లు తెలుస్తోంది. వి.వెంకటరమణ, వెన్నరాజు ల నియామకంపై హుస్నాబాద్ మున్సిపల్ పాలకవర్గ సభ్యులు, హుస్నాబాద్ మండల, పట్టణ కాంగ్రెస్, యువజన కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ, మహిళా కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు. రాబోయే రోజుల్లో పార్టీ ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తూ హుస్నాబాద్ లో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాలని ఆకాంక్షించారు.