పెండింగ్ కేసులపై కోఆర్డినేషన్ కమిటీ సమావేశం
విశ్వంభర, సిద్దిపేట: జిల్లా కేంద్రంలోని కోర్టులో కాంప్లెక్స్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయి రమాదేవి అధ్యక్షతన మంగళవారం నిర్వహించారు. సమావేశానికి జిల్లా అదనపు న్యాయమూర్తి జయప్రసాద్, కలెక్టర్ హైమావతి, వివిధ కోర్టుల జడ్జిలు, పబ్లిక్ ప్రాసిక్యూషన్ లాయర్లు, ఏసీపీలు తదితరులు హాజరయ్యారు. సమావేశంలో ప్రధాన న్యాయమూర్తి జిల్లాలో సివిల్, క్రిమినల్ కేసుల పెండింగ్‌పై చర్చించారు. చాలా కాలం నుంచి పెండింగ్‌లో ఉన్న సివిల్, క్రిమినల్ కేసులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈనెల 20వ తేదీన జాతీయ లోక్ అదాలత్‌లో వివిధ కేసుల పరిష్కారానికి చొరవ తీసుకోవాలని సూచించారు. అత్యధిక కేసులు పరిష్కరించి రాష్ట్రంలో జిల్లాను ముందుంచేలా న్యాయ, పోలీస్ అధికారులు పనిచేయాలని ఆదేశించారు. అధికారులు సమన్వయంతో పనిచేసి కేసులు త్వరగా పరిష్కారమయ్యే విధంగా పనిచేయాలని ఆదేశించారు.