ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించిన కాంగ్రెస్ నాయకులు

విశ్వంబర, పరిగి: మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డు లో ఇందిరమ్మ ఇల్లు ను మున్సిపల్ చైర్ పర్సన్ రజిత వెంకటేష్, ఆలయ కమిటీ చైర్మన్ సిద్ధాంతి పార్థసారథి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సయ్యద్ అయ్యుబ్ స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఎక్కడ ఇండ్లు నిర్మించిన దాఖలాలు లేవని పేర్కొన్నారు. బడుగు బలహీనవర్గాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరంగా కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు రామకృష్ణారెడ్డి, కౌన్సిలర్లు ఎజాజ్, ఆరిఫ్ పటేల్, కోఆప్షన్ సభ్యులు ఆంజనేయులు, అక్బర్, కాంగ్రెస్ నాయకులు చిన్న నరసింహులు, మల్లేష్, బాలు తదితరులు పాల్గొన్నారు.

🕒 23 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/congress-leaders-who-started-indiramma-house/article-16999

Tags: