కక్కెర్ల రవీందర్‌కు జయశంకర్ ఉద్యమ స్ఫూర్తి పురస్కారం
విశ్వంభర, హుస్నాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం–2026 సందర్భంగా వరంగల్‌లో తెలుగు వెలుగు సాహితి ఆధ్వర్యంలో నిర్వహించిన పురస్కారాల మహోత్సవంలో హుస్నాబాద్ పట్టణం టీచర్స్ కాలనీకి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయులు కక్కెర్ల రవీందర్‌ను ఆచార్య కొత్తపల్లి జయశంకర్ ఉద్యమ స్ఫూర్తి గౌరవ పురస్కారం తో ఘనంగా సత్కరించారు. విద్యారంగంలో ఆయన అందిస్తున్న సేవలు, సామాజిక చైతన్య కార్యక్రమాల్లో చూపుతున్న చురుకైన పాత్రను గుర్తిస్తూ ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఈ సందర్భంగా పలువురు విద్యావేత్తలు, సాహితీవేత్తలు, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, మిత్రులు కక్కెర్ల రవీందర్‌కు అభినందనలు తెలియజేశారు.