జర్నలిస్టుల అక్రిడేషన్ సమస్యలు పరిష్కరించండి
- మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి వినతి
- సమాచార శాఖ కమిషనర్ తో చర్చించి పరిష్కరిస్తానని హామీ
విశ్వంభర, ఖమ్మం :జర్నలిస్టుల అక్రిడేషన్ మంజూరు విషయంలో ఉన్న సమస్యలు పరిష్కరించాలని, అక్రిడేషన్ల జీవో లో ఉన్న ఇబ్బందులు సవరించాలని టి యు డబ్ల్యూ జే (ఐ జే యు) జర్నలిస్టు యూనియన్ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి యూనియన్ నేతలు వినతి పత్రం అందజేసి సమస్యలు వివరించారు. శుక్రవారం ఖమ్మం కలెక్టరేట్లో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే .రామనారాయణ, రాష్ట్ర కమిటీ సభ్యులు మాటేటి వేణుగోపాల్, జాతీయ కౌన్సిల్ సభ్యులు నలజాల వెంకటరావు, మాజీ జిల్లా అధ్యక్షులు వనం వెంకటేశ్వర్లు, జిల్లా అధ్యక్షులు ఏనుగు వెంకటేశ్వరరావు, జిల్లా కార్యదర్శి మైస పాపారావు, జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా కార్యదర్శి పి.మహేందర్, జిల్లా జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ అధ్యక్షులు కనకం సైదులు తదితరులు మంత్రిని కలిసి సమస్యలను దృష్టికి తెచ్చారు. ప్రధానమైన 8 డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. సమాచార శాఖ కమిషనర్ తో చర్చించి జర్నలిస్టులకు ఇబ్బందులు లేకుండా అక్రిడేషన్లు మంజూరు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ఖమ్మం నగర కమిటీ అధ్యక్ష కార్యదర్శులు చెరుకుపల్లి శ్రీనివాస్, నంచర్ల జనార్ధన చారి, జిల్లా ఉపాధ్యక్షులు మొయినుద్దీన్, జిల్లా నాయకులు ఏలూరి వేణుగోపాలరావు, పసుపులేటి సత్యనారాయణ, ఖమ్మం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నామా పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.



