ప్రాణం తీసిన రీల్స్ పిచ్చి..  300 అడుగుల ఎత్తు నుంచి పడిపోయిన కారు..!!

ప్రాణం తీసిన రీల్స్ పిచ్చి..  300 అడుగుల ఎత్తు నుంచి పడిపోయిన కారు..!!

  • కొండపై నుంచి కారుపడి యువతి దుర్మరణం
  • డ్రైవింగ్ రాకున్నా రివర్స్ చేసే ప్రయత్నం 
  • మహారాష్ట్రలోని ఎల్లోరా గుహలకు వెళ్లే మార్గంలో ఘటన 
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో 

ఇటీవల సోషల్ మీడియాకు యువతకు వ్యసనంగా మారింది. దీంతో లైకులకు ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌ చేసేందుకు కొత్త దారులను వెతుకుతున్నారు. ప్రమాదకరమైన స్టంట్స్‌ చేసేందుకైనా వెనుకాడటం లేదు. ఈ క్రమంలో ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. తాజాగా ఓ యువతి ఇన్‌స్టా గ్రామ్ రీల్ కోసం డ్రైవింగ్ రాకున్నా కారు నడిపేందుకు సిద్ధమై ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది. 

మహారాష్ట్రాలోని ఎల్లోరా గుహలకు వెళ్లే మార్గంలో ఉన్న దత్ ధామ్ టెంపుల్ కొండపై ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. శ్వేతా సుర్వసే(23) అనే యువతి డ్రైవింగ్ రాకున్నా రీల్స్ కోసం కారు నడిపేందుకు సిద్ధమైంది. అది గ్రౌండ్‌లో.. లేక రోడ్డుపై అయితే బాగానే ఉండేది. కానీ ఆ యువతి ఏకంగా కొండపై కారు స్టీరింగ్ పట్టింది. తనతో పాటు ఉన్న స్నేహితుడు శివరాజ్ ములే వీడియో తీస్తుండగా సదరు యువతి కారు స్టార్ట్ చేసింది. 

Read More పూరీ బీచ్‌లో సీఎం రేవంత్ రెడ్డి సైకత శిల్పం, రేవంత్ బర్త్ డే సందర్భంగా అభిమానాన్ని చాటుకున్న మెట్టు సాయి కుమార్..

వీడియో రికార్డు అవుతుండగానే ఆ యువతి రివర్స్ గేర్ వేసి కారును వెనక్కి పోనిచ్చింది. ఈ క్రమంలో బ్రేక్ వేయడానికి బదులుగా యాక్సిలరేటర్‌ను నొక్కింది. ఇంకేముంది.. సుమారు 300 అడుగుల ఎత్తు ఉన్న ఆ కొండపై నుంచి కారు కిందపడిపోయింది. ఈ ప్రమాదంలో శ్వేతా సుర్వసే అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.