కలెక్టరేట్ ముందు ఐఎఫ్ టియు ధర్నా
విశ్వంభర, మహబూబాబాద్: జిల్లా కేంద్రంలో ఐఎఫ్ టియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు . ఈ ధర్నా కార్యక్రమానికి పర్వత కోటేష్ అధ్యక్షత వహించారు. ధర్నాని ఉద్దేశించి ఐఎఫ్టియు రాష్ట్ర నాయకులు హలవత లింగన్న , ఏపూరి వీరభద్రం మాట్లాడుతూ , తెలంగాణ రాష్ట్రంలో నాలుగు లేబర్ కోడ్ లను అమలు చేయలేమంటూ మార్చి 16 నుండి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశంలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖకు పంపాలని డిమాండ్ చేశారు. కార్మికల హక్కులకు తీవ్ర నష్టకరమైన నాలుగు లేబర్ కోడ్ లను తక్షణమే వెనక్కి తీసుకోవాలని తదితర డిమాండ్లతో భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టియు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కి వినతిపత్రం అందజేసారు . కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న కార్మిక చట్టాలలో 29 రకాల కార్మిక చట్టాలను క్రోడీకరించి నాలుగు లేబర్ కోర్సులను రూపొందించిన విషయం తమ అందరికీ తెలిసినదే లేబర్ కోర్స్ అమల్లో వస్తే గత చట్టాలలో ఉన్న అరా కోరా కార్మిక ప్రయోజనాలు సంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో అందకుండా పోతాయి కార్మికుల మౌలిక జీవనాదర హక్కులైనా కనీస వేతనాలు సమాన పనికి సమాన వేతనం 8 గంటల పని దినపు హక్కు సమ్మెలకు ఏర్పాటు చేసుకునే హక్కు యాజమాన్యంతో కానీ ప్రభుత్వంతో గాని నేగోషియన్ జరిపే హక్కు దూరమయ్యే ప్రమాదం తీవ్రంగా పొంచి ఉన్నది కోట్లాదిమంది కార్మికులు లేబర్ కోడ్స్ వలన కార్మికుల జాబితా నుండి తొలగించబడతారు అన్నారు . మరియు శాశ్వత ఉపాధ్యాయ వ్యవస్థ స్థానంలో ఫిక్స్ టర్మ్ ఎంప్లాయిమెంట్ వస్తా నెలకొంటుంది, వలస కార్మికులను కాంట్రాక్టు కార్మికుల జాబితాలో చేర్చి వారి సంఖ్యను ఐదు నుంచి పదికి పెంచడం వలన వేలాది మంది కార్మికులకు ఎలాంటి పద్ధతి రక్షణ లేకుండా పోతున్నది గుర్తు చేసారు. కార్మికులకు వారి పని స్థలాలలో తగిన రక్షణ లేక భద్రత లేక అనేకమంది మృత్యువాత పడుతున్న ప్రమాదంలో డజన్ల సంఖ్యలో కార్మికులు మృత్యువాత పడ్డ విషయం తాజాగా మన ముందుంది ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న అరాకురా పర్యవేక్షణ ఉన్న తనిఖీ వ్యవస్థ ఎత్తివేశారు . వేతనాల చెల్లింపు కనీస వేతనం అమలు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్న రాజ్యాంగ నిర్దేశపు ఆదేశాలను సుప్రీంకోర్టు తీర్పును బి ఖాదర్ చేస్తున్న పరిస్థితులలో రూపొందించిన వేతన కోడ్ పరిస్థితిలకు మరింత తోడ్పాటు అందిస్తుంది అందువల్ల కార్మికుల వర్గ ప్రయోజనాలకు వ్యతిరేకమైన ఈ లేబర్ కోర్సులను కేంద్ర ప్రభుత్వం వెంటనే పూర్తిస్థాయిలో వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం మీద తగిన స్థాయిలో ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నాం లేనియెడల పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరించారు . ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా నాయకులు భూక్య రాము , తేజావత్ శోభన్, పులిగిల్ల మల్లయ్య ,అల్లి ఏకాంబరం ,పట్టాభి మల్లేశం ,సురేష్ లింగన్న జయశంకర్ గోపి కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు .



