ప్లాస్టిక్ రహిత సమాజమే లక్ష్యం

ప్లాస్టిక్ రహిత సమాజమే లక్ష్యం

  •  విద్యార్థుల ప్రతిజ్ఞ

విశ్వంభర, మేడ్చల్: "99 రోజుల ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక"లో భాగంగా పర్యావరణ పరిరక్షణ దిశగా మేడ్చల్ ప్రాంతీయ కాలుష్య నియంత్రణ మండలి కీలక అడుగు వేసింది. కూకట్‌పల్లిలోని రిషి యుబిఆర్ ఉమెన్స్ కాలేజీలో సోమవారం “సే నో టు సింగిల్ యూజ్ ప్లాస్టిక్” పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పర్యావరణ హితమే ముఖ్యం: ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ శ్రీ బి. రాజేందర్ మాట్లాడుతూ.. ప్లాస్టిక్ వినియోగం వల్ల భూగర్భ జలాలు, మట్టి, జీవవైవిధ్యం దెబ్బతింటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రత్యామ్నాయాల వైపు అడుగులు: నిత్యజీవితంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌కు స్వస్తి పలికి, పర్యావరణహిత వస్తువులను వాడాలని ఆయన విద్యార్థులకు సూచించారు. సుమారు 200 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని, ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్థాలపై తమ గళాన్ని వినిపించారు. విద్యార్థులలో అవగాహన పెంచేందుకు క్విజ్ పోటీలు నిర్వహించి, ప్లాస్టిక్ నిషేధానికి సంబంధించిన పోస్టర్లను ప్రదర్శించారు. కార్యక్రమం చివరలో విద్యార్థులందరితో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడబోమని, పర్యావరణాన్ని కాపాడతామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో కాలేజీ అధ్యాపకురాలు భార్గవి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు.

Tags: