ఏఆర్‌ రెహమాన్‌పై జాలి వద్దు.. ఆయన చాలా రిచ్‌..!

నాలాంటి పేదలకే కష్టాలు: తస్లీమా నస్రీన్‌

ఏఆర్‌ రెహమాన్‌పై జాలి వద్దు.. ఆయన చాలా రిచ్‌..!

బాలీవుడ్‌లో వివక్షపై ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. దీనిపై ప్రముఖ రచయిత్రి తస్లీమా నస్రీన్‌ సోషల్ మీడియా వేదికగా ఘాటుగా స్పందించారు.

 

విశ్వంభర, సినిమా బ్యూరో: బాలీవుడ్‌లో వివక్షపై ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. దీనిపై ప్రముఖ రచయిత్రి తస్లీమా నస్రీన్‌ సోషల్ మీడియా వేదికగా ఘాటుగా స్పందించారు. రెహమాన్ లాంటి సంపన్న, ప్రసిద్ధ వ్యక్తులకు మతం లేదా ప్రాంతం పేరుతో ఇబ్బందులు ఎదురవుతాయనడం నమ్మశక్యంగా లేదని ఆమె అభిప్రాయపడ్డారు. ఏఆర్ రెహమాన్ భారత్‌లో అత్యంత గౌరవం పొందే వ్యక్తి. ఆయన సంపన్నుడు మాత్రమే కాదు, అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే సంగీతకారుడు అని అన్నారు. 
బాలీవుడ్‌లో షారుఖ్‌ ఖాన్‌, సల్మాన్‌ ఖాన్‌, ఆమిర్‌ ఖాన్‌ వంటి వారు సూపర్ స్టార్లుగా కొనసాగుతున్నారు. వారు ఏ మతానికి చెందినవారైనా సరే, వారి స్థాయికి ఎటువంటి ఇబ్బందులు ఎదురుకావు. "నాలాంటి పేదలకే కష్టాలు ఉంటాయి. రెహమాన్ లాంటి వ్యక్తులను అన్ని మతాల వారు గౌరవిస్తారు. కాబట్టి ఆయన విషయంలో ఎవరూ జాలిపడాల్సిన అవసరం లేదు" అని ఆమె పేర్కొన్నారు.


అసలు రెహమాన్ ఏమన్నారు?

Read More తొలిరోజు ముగిసిన విజయ్ సీబీఐ విచారణ

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో బాలీవుడ్‌లో ప్రాంతీయ లేదా మతపరమైన పక్షపాతం ఉందా అన్న ప్రశ్నకు రెహమాన్ బదులిస్తూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. గత ఎనిమిదేళ్లుగా చిత్ర పరిశ్రమలో 'పవర్ షిఫ్ట్' జరిగిందని, సృజనాత్మకత లేని వ్యక్తులు కీలకంగా మారుతున్నారన్నారు. తనకు వ్యక్తిగతంగా వివక్ష ఎదురుకాకపోయినా, మతపరమైన కారణాల వల్ల పని దొరకడం లేదనే గుసగుసలు తన చెవిన పడ్డాయని తెలిపారు. తాను పని కోసం ఎవరి వెనకాల తిరగనని, చిత్తశుద్ధితో పని చేస్తే అవకాశాలు అవే వస్తాయని ఆయన స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు దుమారం రేపడంతో ఆయన వెంటనే స్పందించారు. తన లక్ష్యం సంగీతం ద్వారా సేవ చేయడం, గౌరవించడమే తప్ప ఎవరినీ బాధపెట్టడం కాదని క్లారిటీ ఇచ్చారు.