బీజేపీ రాష్ట్ర ప్రతినిధిగా బి. ఇంద్రసేన్ రెడ్డి 

బీజేపీ రాష్ట్ర ప్రతినిధిగా బి. ఇంద్రసేన్ రెడ్డి 

విశ్వంభర, హైదరాబాద్: ప్రముఖ వ్యాపారవేత్త, పెట్టుబడిదారుడు బి. ఇంద్రసేన్ రెడ్డి  తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రతినిధిగా నియమితులయ్యారు. టెక్నాలజీ, సోలార్ ఎనర్జీ, రియల్ ఎస్టేట్ రంగాల్లో దాదాపు మూడు దశాబ్దాల సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయనకు పార్టీ కీలక బాధ్యతలను అప్పగించింది. తనపై విశ్వాసం ఉంచి ఈ బాధ్యతను అప్పగించినందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు కి ఇంద్రసేన్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిజాయితీ, సమానత్వ భావంతో తెలంగాణలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని స్పష్టం చేశారు. లఘు ఉద్యోగ్ భారతి, భారత్ గ్లోబల్ ఇండస్ట్రీస్ ఫోరమ్ వంటి సంస్థల్లో కీలకంగా వ్యవహరిస్తున్న ఆయన, తన అనుభవంతో 'వికసిత భారత్' లక్ష్య సాధనలో భాగస్వామ్యం అవుతానని పేర్కొన్నారు. ఇంద్రసేన్ రెడ్డి నియామకం పట్ల పలువురు పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేశారు.

Tags: