ఫర్నిచర్ గోదాంలో అగ్నిప్రమాదం
On
విశ్వంభర, చంద్రాయణ గుట్ట: ఫలక్ నుమా ఫారుక్ నగర్ ప్రాంతంలోని ఫర్నిచర్ గోదాం లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఎగిసిపడుతున్న దట్టమైన మంటలు , పొగ కమ్మేయడంతో భయాందోళనకు గురైన స్థానికులు అగ్నిమాపక సిబ్బంది కి, స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన సంఘటన స్థలానికి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది చేరుకొని ఫైర్ ఇంజన్ లతో మంటలను అదుపు చేశారు.



