మతసామరస్యానికి ప్రతీక రంజాన్
On
విశ్వంభర, పరిగి: మతసామరస్యానికి ప్రతీక రంజాన్ అని సమాజ సేవకులు భాస్కర్ గౌడ్ అన్నారు. దోమ మండల పరిధిలోని ఐనాపూర్ గ్రామంలో తన నివాసంలో ముస్లిం సోదరులకు సమాజ సేవకులు భాస్కర్ గౌడ్ ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఉపవాస దీక్ష విరమణ సందర్భంగా ఖర్జూర పండ్లను పలువురి ముస్లిం సోదరులకు భాస్కర్ గౌడ్ తినిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పవిత్ర రంజాన్ మాసం ఆధ్యాత్మిక సహనం, పరస్పర సహకారం సామాజిక ఐక్యతకు ప్రాతిక అన్నారు. ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వార్డ్ సభ్యులు, ముస్లిం పెద్దలు, నాయకులు, యువకులు పాల్గొన్నారు.



