ఇరాన్‌పై యుద్ధాన్ని ఆపాలి

ఇరాన్‌పై యుద్ధాన్ని ఆపాలి

  •  వామపక్షాల నిరసన

విశ్వంభర, నారాయణగూడ : ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఆధిపత్యం సాధించాలనే లక్ష్యంతో అమెరికా ఇరాన్‌పై యుద్ధాన్ని కొనసాగిస్తోందని వామపక్ష నేతలు డాక్టర్ కె.నారాయణ, బి.వి.రాఘవులు విమర్శించారు. ప్రపంచ శాంతి కోసం ఈ యుద్ధాన్ని తక్షణమే నిలిపివేయాలని, ఈ దిశగా భారత ప్రభుత్వం అమెరికాపై ఒత్తిడి తేవాలని అన్నారు. హైదరాబాదు నారాయణగూడలో జరిగిన నిరసన కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ దేశాల దాడులను వ్యతిరేకిస్తూ సిపిఐ, సిపిఐ(ఎం), సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్, సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ తదితర వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నారాయణగూడ చౌరస్తా నుంచి వైఎంసిఎ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ అమెరికా సామ్రాజ్యవాద ధోరణితో ప్రపంచ దేశాలపై ఆధిపత్యం సాధించాలనే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. యుద్ధం కొనసాగితే ప్రపంచ దేశాలపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో జాన్ వెస్లీ, హనుమేష్ ఈ.టి.నరసింహా , ఆశయ్య, అరుణ, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

Tags: