బడ్జెట్‌లో రూ.25 వేల కోట్లు కేటాయించాలి

విశ్వంభర, హైదరాబాదు : గిరిజనులకు ఇచ్చిన హామీల అమలుకు 2026–27 రాష్ట్ర బడ్జెట్‌లో రూ.25 వేల కోట్లు కేటాయించాలని తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం.ధర్మ నాయక్, ప్రధాన కార్యదర్శి ఆర్.శ్రీరాం నాయక్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి దళితులు, గిరిజనుల ఓట్లే ప్రధానమని, చేవెళ్ల డిక్లరేషన్‌లో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. గత రెండేళ్ల బడ్జెట్‌లో గిరిజనులకు కేటాయించిన నిధుల్లో పెద్ద మొత్తాన్ని ఖర్చు చేయకుండా మళ్లించారని విమర్శించారు. అంబేడ్కర్ అభయహస్తం పథకం, సమ్మక్క–సారక్క గ్రామీణ అభివృద్ధి, గిరిజన కార్పొరేషన్లు, ఐటీడీఏల ఏర్పాటు, విద్యాజ్యోతి పథకం అమలుకు తగిన నిధులు కేటాయించాలని కోరారు. మార్చి 20న ప్రవేశపెట్టే బడ్జెట్‌లో ఈ నిధులు కేటాయించకపోతే గిరిజనుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

Tags: