అంతర్జాతీయ శ్రామిక పోరాట దినం

అంతర్జాతీయ శ్రామిక పోరాట దినం

విశ్వంభర, హైదరాబాద్ :  అంతర్జాతీయ శ్రామిక పోరాట దినం సందర్బంగా చైతన్య మహిళా సంఘం రాష్ట్ర కొకన్వీనర్ శ్రీదేవి అధ్యక్షతన  డైట్ కాలేజీలో సెమినార్ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మహిళల సమస్యల మీద మాట్లాడారు. అంతర్జాతీయ మహిళా శ్రామిక పోరాట దినం అంటే అందాల పోటీలు, ముగ్గులు పోటీలు కాదని అదొక స్ఫూర్తిదాయకమైనటువంటి రోజు అని తెలియజేశారు మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను సామాజికంగా, ఆర్థికంగా రాజకీయంగా సాంస్కృతిక పరంగా మహిళలు మరింత ముందు ఉండే వాటిని ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు.అనంతరం డైట్ కాలేజీ లెక్చరర్ జ్యోతి మాట్లాడుతూ,  మహిళల కి వేరే ఎవరో చెప్పనవసరం లేదని తమకు తాము అద్భుతంగా సృష్టించుకోగలదని అన్నారు.పాలమూరు యూనివర్సిటీ జేఏసీ లీడర్ నరేందర్ మాట్లాడుతూ,  మహిళలు అన్ని రంగాలలో సాధించాల్సింది ఇంకా మిగిలే ఉందని అన్నారు.ఈ  కార్యక్రమంలో డైట్ లెక్చరర్స్ రఫియా, ఐషా, బాలిశ్వరి, పాలమూరు యూనివర్సిటీ విద్యార్థి పవన్ పాల్గొన్నారు.

Tags: