వాహనదారుల భద్రతకు హెల్మెట్ తప్పనిసరి

వాహనదారుల భద్రతకు హెల్మెట్ తప్పనిసరి

విశ్వంభర, విద్యానగర్ : రోడ్డు ప్రమాదాల సమయంలో ప్రాణాలను కాపాడుకోవడంలో హెల్మెట్ కీలక పాత్ర పోషిస్తుందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి వి.హనుమంతరావు తెలిపారు. ద్విచక్ర వాహనదారులు తమ భద్రత కోసం తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, రోడ్డు భద్రత నియమాలను పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవ కార్యక్రమంలో భాగంగా ‘అరైవ్ అలైవ్ ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రాం’ నిర్వహించారు. ఈ సందర్భంగా హైదరాబాదు విద్యానగర్ ఉస్మానియా విశ్వవిద్యాలయ గేటు సమీపంలో ద్విచక్ర వాహనదారులకు తన సొంత డబ్బులతో 300 హెల్మెట్లను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా తలకు గాయాల వల్లే ప్రాణనష్టం జరుగుతుందని, హెల్మెట్ వాడకం ద్వారా ఆ ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చని పేర్కొన్నారు. ముఖ్యంగా యువత రోడ్డు నియమాలను పాటిస్తూ సురక్షితంగా ప్రయాణించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సర్వేజనా ఫౌండేషన్ ప్రతినిధి అర్చన పాల్గొన్నారు. హెల్మెట్ ధరించని వాహనదారులకు అవగాహన కల్పించే ఉద్దేశంతో యమధర్మరాజు వేషధారణలో అర్జున్ రావు ప్రత్యేకంగా ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణ, నల్లకుంట ఎస్హెచ్ఓ మురళీధర్, ఖైరతాబాదు డీసీసీ అధ్యక్షుడు మోత రోహిత్ ముదిరాజ్, లింజిస్టిక్ చైర్మన్ రాజేష్ అగర్వాల్, పీసీసీ జనరల్ సెక్రటరీ నాగభూషణం, ఆర్ లక్ష్మణ్ యాదవ్, శంభుల శ్రీకాంత్ గౌడ్, మాజీ కార్పొరేటర్లు దిడ్డి రాంబాబు, నారాయణస్వామి, గరిగంటి శ్రీదేవి రమేష్, పులి జగన్, లక్ పతి యాదగిరి గౌడ్, కాంగ్రెస్ నాయకులు ఈ డెల్లి ప్రభాకర్, షేక్ జమీర్, శ్రీధర్ గౌడ్, పంజాల వెంకటేష్ గౌడ్, కోటం అనిల్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

Tags: