యాసంగి పంటలకు నీటి విడుదల
On
విశ్వంభర, కౌకుంట్ల : మహబూబ్నగర్ జిల్లాలోని దేవరకద్ర నియోజకవర్గం కౌకుంట్ల మండల కేంద్రంలో ని రైతులు సాగు చేస్తున్న యాసంగి పంటలకు తగినంత నీరు లేకపోవడంతో పంటలు ఎండిపోతున్న పరిస్థితి తెలిసి గ్రామ సర్పంచ్ ఉల్లి నరేష్ ప్రత్యేక చొరవ తీసుకొని కౌకుంట్లలోని పెద్ద చెరువు నుండి ఆయకట్టు వ్యవసాయ రైతులకు నీటిని విడుదల చేశారు. ఈ చర్యతో రైతులకు ఎంతో ఊరట లభించగా పంటలు నిలబెట్టుకోవడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని రైతులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఉల్లి నరేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి కిషన్ రావు, గ్రామ రైతులు, యువకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.



