ఓటీఎస్ ను సద్వినియోగం చేసుకోవాలి

ఓటీఎస్ ను సద్వినియోగం చేసుకోవాలి

  •  జీహెచ్ఎంసీ కమిషనర్ అర్ వి కర్ణన్ పిలుపు 

 విశ్వంభర, జిహెచ్ఎంసీ : ఆస్తి పన్ను వడ్డీపై 90శాతం రాయితీతో పన్ను చెల్లించేందుకు అవకాశం కల్పించినట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు. మార్చి 31 వరకు ఈ అవకాశం ఉంటుందన్నారు. వన్ టైమ్ సెటిల్మెంట్ (ఓటీఎస్) స్కీమ్ ను అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. క్యూర్ ఏరియాలో 28 లక్షల 8 వేల  ఆస్తి పన్నుదారుల్లో 16 లక్షల 80 వేల  మంది చెల్లించారని చెప్పారు. సోమవారం జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ లో ప్రాపర్టీ టాక్స్ ఓ టి ఎస్ స్కీం వివరాలు వెల్లడించేందుకు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్ వి కర్ణన్, రెవెన్యూ అదనపు కమిషనర్ ప్రియాంక అల, సానిటేషన్ అదనపు కమిషనర్ రవి కిరణ్, ప్రజా సంబంధాల అధికారి మామిండ్ల దశరథం తో కలిసి పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, క్యూర్ ఏరియా  పరిధి జీహెచ్ఎంసీ లో గత ఆర్థిక సంవత్సరం ఇదే రోజు నాటికి ఆస్తి పన్ను వసూళ్లు 1984 కోట్లు  కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నేటి వరకూ  రూ.2,186 కోట్ల పన్ను వసూలైందన్నారు. పన్ను చెల్లింపుల్లో పారదర్శకత, జవాబుదారితరాన్ని పెంపొందించేందుకు ఆన్లైన్ విధానంలో ప్రాపర్టీ టాక్స్ స్వీకరిస్తున్నట్లు తెలిపారు. మీ సేవ,www ghmc.gov.in పోర్టల్,  సిటిజన్ సర్వీస్ సెంటర్, మై క్యూర్ లలో ఆస్తి పన్ను దీర్ఘకాలికంగా చెల్లించని వారి పై జిహెచ్ఎంసి చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని కమిషనర్ స్పష్టం చేశారు. పన్ను చెల్లింపుతో పాటు అసెస్మెంట్ , కరెక్షన్ సహా అనేక సేవలు  మై క్యూర్ అప్లికేషన్ లో అందుబాటులో ఉంటాయన్నారు.సాంకేతికత దన్నుగా జిహెచ్ఎంసి పరిధిలో సుపరిపాలన అందించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నామని కర్ణన్ సందర్భంగా తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” కార్యక్రమం లో భాగంగా కార్యక్రమం ప్రారంభమైన ఈ నెల 6 నుంచి 16 వ తేదీ వరకూ జీహెచ్ఎంసీ పరిధిలోని 6 జోన్లు, 30 సర్కిల్ కార్యాలయాలు, 150 వార్డుల పరిధిలోని జీహెచ్ఎంసీ కార్యాలయాల క్లీనింగ్, ఫైల్స్ క్లియరెన్స్,GVP ల మ్యాపింగ్ , ఎలిమినేషన్ చర్యలు, సి అండ్ డి వేస్ట్ తొలగింపు, అండర్ పాస్ లు, ఫ్లై ఓవర్ లు, ఫైర్ సేఫ్టీ, ఈ వేస్ట్ మెగా డ్రైవ్, ప్రజా మరుగుదొడ్ల క్లీనింగ్, నిర్వహణ పై ప్రత్యేక డ్రైవ్ లు చేపట్టామని చెప్పారు. జీహెచ్ఎంసీ పరిధిలో పారిశుద్ధ్యంపై ఎక్కువ దృష్టి పెట్టామన్నారు. గార్బేజ్ వల్నరబుల్ పాయింట్ లు ఉండొద్దన్న లక్ష్యంతో పని చేస్తున్నామని కమిషనర్ తెలిపారు. అలాగే  మెగా ఈ-వేస్ట్ డ్రైవ్ ను సక్సెస్ ఫుల్ గా చేపట్టామని కమిషనర్ కర్ణన్ తెలిపారు.  ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక అమలు కాలంలో పారిశుధ్యం పై మరింత ఫోకస్ పెట్టి గ్రేటర్ హైదరాబాద్ నగరాన్ని పరిశుభ్ర నగరంగా తీర్చి దిద్దుతామని కమిషనర్ తెలిపారు.

Tags: