సమస్యలపై మంత్రికి వినతిపత్రం

సమస్యలపై మంత్రికి వినతిపత్రం

విశ్వంభర, హైదరాబాదు : ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ ఐఎన్‌టీయూసీ (ఎస్‌డబ్ల్యుయూ) రాష్ట్ర కమిటీ సోమవారం రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ను కలిసి వినతిపత్రం అందజేసింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఆర్టీసీ కార్మికుల సమస్యలపై ప్రభుత్వానికి పూర్తి అవగాహన ఉందన్నారు. గత ప్రభుత్వంలో ఆర్టీసీ మూసివేత పరిస్థితి ఏర్పడిందని, ప్రస్తుతం సంస్థను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామని తెలిపారు. కార్మికులు ఆందోళన చెందకుండా సమస్యల పరిష్కారంలో కొంత సమన్వయం పాటించాలని సూచించారు. డీఏలు, ఇతర పెండింగ్ బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎన్‌టీయూసీ (ఎస్‌డబ్ల్యుయూ) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గొడిశాల అబ్రహం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జెక్కుల మల్లేశ్ గౌడ్, రాష్ట్ర కమిటీ సభ్యులు భాస్కర్, ఎండీ అక్బర్ అలీ, సి పాండు, శివకుమార్, ఎం సంపత్, విజయబాబు, వీ బి రావు, కేఎస్ రెడ్డి, కేజీ సాగర్, టి ఆర్ రెడ్డి, ఎంకే రాజు, రజిని కుమార్, జెఎల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags: