జలమండలి అధికారులకు వినతి 

జలమండలి అధికారులకు వినతి 

 విశ్వంభర, చంద్రాయణ గుట్ట : చంద్రాయణ గుట్ట నియోజకవర్గంలోని శివగంగ నగర్, తానాజీ నగర్, భగత్ సింగ్ నగర్, నాయక్ నివాస్  నగర్, ప్రాంతాలలో మంచినీళ్లు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్న తీరును గమనించిన  కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ బోయ నగేష్ బాలాపూర్ జలమండలి జిఎం భాస్కర్ ని కలిసి నూతన వాటర్ పైప్ లైన్ ను ఏర్పాటు చేయాలని, వాటర్ కలుషితం అవుతున్న ప్రాంతాలను గుర్తించి త్వరగా చర్యలు తీసుకోవాలని , ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని వినతిపత్రం అందజేశారు, జిఎం భాస్కర్ సమస్యను త్వరితగతిన పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్  నాయకులు పాల్గొన్నారు.

Tags: