ఆరోగ్య భారత్ సాధనలో టీకాలు కీలకం

ఆరోగ్య భారత్ సాధనలో టీకాలు కీలకం

 విశ్వంభర, బాగ్ లింగంపల్లి: ఆరోగ్య భారత్ సాధనలో టీకాలు కీలక పాత్ర పోషిస్తాయని ఆర్‌బీవీఆర్‌ఆర్ ఉమెన్స్ కాలేజ్ ఆఫ్  ఫార్మసీ డాక్టర్ కుసుమ అన్నారు. అంటువ్యాధులను నివారించడంలో టీకాలు ప్రభావవంతంగా పనిచేస్తాయని, సమయానికి టీకాలు తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని పేర్కొన్నారు. జాతీయ టీకాకరణ దినోత్సవం సందర్భంగా హైదరాబాదు బాగ్ లింగంపల్లి సుందరయ్య పార్క్‌లో సోమవారం వాకర్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాదు సెంట్రల్ ఆధ్వర్యంలో టీకాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వాకర్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాదు సెంట్రల్, సుందరయ్య పార్క్, ఆర్‌బీవీఆర్‌ఆర్ ఉమెన్స్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ బర్కత్ పుర సంయుక్తంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాయి. ఈ సందర్భంగా పెద్దలు, వృద్ధులు ముందస్తు రోగనిరోధక టీకాలు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. సమాజంలో ఆరోగ్య చైతన్యం పెంపొందించేందుకు ఇటువంటి అవగాహన కార్యక్రమాలు అవసరమని తెలిపారు. కార్యక్రమంలో ఆర్‌బీవీఆర్‌ఆర్ ఉమెన్స్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ బర్కత్ పుర ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఎం సుమాకాంత్ సూచనతో వాకర్లకు ఆరోగ్య సూచనలు, కరపత్రాలు,  ఆర్‌బీవీఆర్‌ఆర్ ఉమెన్స్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ బర్కత్ పుర విద్యార్థినిలు అందజేశారు. కార్యక్రమంలో వాకర్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాదు సెంట్రల్ పాస్ట్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ నాగభూషణం, డిస్ట్రిక్ట్ 301 గవర్నర్ డాక్టర్ బి. గంగాధర్ రెడ్డి, ఏవీపీ మురళీకృష్ణ, పాస్ట్ ఏవీపీ సంపత్ రెడ్డి, ఐపీపీ పి.వి. నిరంజన్ రెడ్డి, పాస్ట్ ప్రెసిడెంట్ ఎస్. రమేష్ రెడ్డి, వాకర్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాదు ప్రెసిడెంట్ విద్యాసాగర్ పాల్గొన్నారు.

Tags: