ప్రశ్నించే హక్కు బీజేపీకి లేదు: రాములమ్మ

ప్రశ్నించే హక్కు బీజేపీకి లేదు: రాములమ్మ

తెలంగాణలో అన్ని పార్టీల ఫోకస్ ఇప్పుడు రాష్ట్ర అవతరణ దినోత్సవం పైనే ఉంది. తెలంగాణ ప్రభుత్వం సోనియా గాంధీని ఈ వేడుకులకు చీఫ్ గెస్ట్ గా ఆహ్వానించారు. సీఎం రేవంత్ రెడ్డి వెళ్లి స్వయంగా పిలిచారు. అయితే, ఆమె హాజరవుతారా? లేదా అనే దానిపై ఉత్కంఠ నడుస్తోంది. కానీ.. ఆమె రావాడాన్ని బీజేపీ వ్యతిరేకిస్తోంది. రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు సోనియా ఎలా హాజరవుతారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. దీనిపై సినీనటి, కాంగ్రెస్ సీనియర్ నేత విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోనియాను ఆహ్వానించడాన్ని ప్రశ్నించే అర్హత బీజేపీ లేదని ఆమె స్పష్టం చేశారు. 

 

Read More క్రీడల వల్ల విద్యార్థులలో స్నేహభావం పెరుగుతుంది : డా.  కోడి శ్రీనివాసులు 

ఒక ఓటు రెండు రాష్ట్రాలు అని ప్రకటించి బీజేపీ మాట తప్పిందని మండిపడ్డారు. తెలంగాణ ఏర్పాటుపై బీజేపీ బాధ్యత తీసుకోకుండా బీజేపీ పక్కన పెడితే.. ఆ బాధ్యత కాంగ్రెస్ తీసుకుందని గుర్తు చేశారు. రాజకీయంగా నష్టం జరిగినా.. తెలంగాణ ఏర్పాటుకు సోనియాగాంధీ ముందుకు వచ్చారని అన్నారు. ప్రాణాలను త్యాగం తెలంగాణ ఉద్యమకారులు గౌరవించిన ఘనత సోనియాకే దక్కుతుందని రాములమ్మ ట్వీట్ చేశారు. 

 

Read More క్రీడల వల్ల విద్యార్థులలో స్నేహభావం పెరుగుతుంది : డా.  కోడి శ్రీనివాసులు 

ప్రత్యామ్నాయం లేక పార్లమెంటులో తెలంగాణ బిల్లుకు బీజేపీ ఓటు వేసిందని విమర్శించారు. నిజానికి తెలంగాణ ఏర్పాటులో బీజేపీ ప్రమేయం ఎక్కడుందని ఆమె ప్రశ్నించారు. ఇది తన ప్రశ్న కాదని.. తెలంగాణ సమాజం, ఉద్యమకారుల ప్రశ్న అని ఆమె అన్నారు. కాబట్టి కాంగ్రెస్ ను, సోనియా గాంధీని విమర్శించడం మానుకోవాలని బీజేపీ నేతలకు రాములమ్మ సూచించారు.