కాళేశ్వరం మరమ్మతులపై జలసౌధలో కీలక సమావేశం 

కాళేశ్వరం మరమ్మతులపై జలసౌధలో కీలక సమావేశం 

కాళేశ్వరం మారమ్మతుల పనులపై జలసౌధలో కీలక సమావేశం జరుగుతోంది. నలుగురు అధికారులు ఈ భేటీకి హాజరైయ్యారు. కమిటీ చైర్మన్‌గా ఇరిగేషన్ జనరల్ ఈ.ఎన్.సి అనిల్ కుమార్, ఆపరేషన్స్ అండ్ మెంటనేన్స్ ఈ.ఎన్.సి నాగేందర్ రావు, రామగుండం సీఈ సుధాకర్ రెడ్డి, సెంట్రల్ డెజైన్స్ ఆర్గనైజేషన్స్ సీఈ మోహన్ కుమార్ భేటీ అయ్యి చర్చిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎన్డీఎస్ఏ బృందం ఇచ్చిన మధ్యంతర నివేదికపై చర్చ జరుగుతోంది. 

 

Read More  చండూర్ పట్టణ ప్రజలకు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు -  కోడి బ్రదర్స్ 

ఈ నివేదిక ఆధారంగా మరమ్మతులపై నిర్ణయం తీసుకోనున్నారు. వర్షాకాలం రానున్న నేపథ్యంలో బ్యారేజీల రక్షణ కోసం తీసుకోవాల్సిన తాత్కాలిక చర్యలపై కమిటీ చర్చిస్తోంది. ఇటీవలే రెండు రోజుల పాటు నిపుణుల కమిటీ బ్యారేజీలను సందర్శించింది. డ్యామేజ్ అయిన మేడిగడ్డ, సుందిళ్లు, అన్నారం బ్యారేజీలను సందర్శించారు. ఇప్పటికే దీనిపై ఓ అవగాహన వచ్చింది. నిపుణుల కమిటి సిఫారుసులు, ఎన్డీఎస్ఏ కమిటీ సూచనలను దృష్టిలో పెట్టుకొని డ్యామేజ్ జరిగిన బ్యారేజీలకు మరమ్మతులు చేయనున్నారు.

 

ఇప్పటికే మరమ్మతుల కోసం బ్యారేజీల్లో చాలా వరకు నీటికి కిందకు విడుదల చేశారు. బ్యారేజీలు పూర్తిగా ఖాళీ అయిన తర్వాత నిపుణుల సూచనల మేరకు రిపేర్ పనులు చేపట్టనున్నారు.