పోలీసింగ్‌లో యువత భాగస్వామ్యం.. హైదరాబాద్ పోలీసుల వినూత్న ముందడుగు

పోలీసింగ్‌లో యువత భాగస్వామ్యం.. హైదరాబాద్ పోలీసుల వినూత్న ముందడుగు

 హైదరబాద్ నగర పోలీసులు సరికొత్త నిర్ణయంతో ముందుకొచ్చారు. విద్యావంతులైన యువతలోని సృజనాత్మకతను, సాంకేతిక నైపుణ్యాన్ని పోలీసింగ్‌లో భాగస్వామ్యం చేసేందుకు 'ఇంటర్న్‌షిప్', 'ప్రొఫెషనల్ వాలంటీర్' ప్రోగ్రామ్‌లను ప్రారంభించారు. 

విశ్వంభర, తెలంగాణ బ్యూరో: హైదరబాద్ నగర పోలీసులు సరికొత్త నిర్ణయంతో ముందుకొచ్చారు. విద్యావంతులైన యువతలోని సృజనాత్మకతను, సాంకేతిక నైపుణ్యాన్ని పోలీసింగ్‌లో భాగస్వామ్యం చేసేందుకు 'ఇంటర్న్‌షిప్', 'ప్రొఫెషనల్ వాలంటీర్' ప్రోగ్రామ్‌లను ప్రారంభించారు. దీని ద్వారా అటు విద్యార్థులకు ప్రభుత్వ పరిపాలనపై అవగాహన, ఇటు పోలీస్ శాఖకు నూతన దృక్పథం లభిస్తుందని అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రక్రియ అంతా పోలీస్ కమిషనర్ పర్యవేక్షణలో ఎస్‌ఎమ్‌ఐటీ సెల్ ద్వారా కొనసాగుతుంది.

ఇంటర్న్‌షిప్ అర్హతలు - బాధ్యతలు
ఈ ప్రోగ్రామ్ ముఖ్యంగా డిగ్రీ, పీజీ చదువుతున్న విద్యార్థుల కోసం ఉద్దేశించబడింది. 25 ఏళ్ల లోపు వయస్సు ఉండి, ప్రస్తుతం విద్యనభ్యసిస్తున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి డేటా అనాలసిస్, రీసెర్చ్ ప్రాజెక్టులు, ఆధునిక పోలీసింగ్ పద్ధతులకు సంబంధించిన పనులను కేటాయిస్తారు. ప్రోగ్రాంను విజయవంతంగా పూర్తి చేసిన వారికి హైదరాబాద్ సిటీ పోలీస్ నుంచి అధికారిక సర్టిఫికెట్ అందజేస్తారు. కేవలం విద్యార్థులే కాకుండా, వివిధ రంగాల్లో నైపుణ్యం ఉన్న నిపుణులు కూడా 'వాలంటీర్'గా చేరి సాంకేతిక లేదా ప్రక్రియ ఆధారిత పనుల్లో పోలీసులకు సహకరించవచ్చు.

Read More అయ్యప్ప సన్నిధిలో విత్రీ న్యూస్ క్యాలెండర్ ఆవిష్కరణ. - విత్రీ న్యూస్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు. 

సరికొత్త ఆలోచనలకు వేదిక
ఈ అంశంపై నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ మాట్లాడుతూ.. విద్యార్థులు పోలీసు అధికారులతో కలిసి పనిచేస్తూ, విభాగపు పనితీరులో సరికొత్త ఆలోచనలను జోడించడానికి ఇదొక చక్కని వేదిక అని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు విలువైన అనుభవం లభిస్తుందని పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన వారు హైదరాబాద్ పోలీస్ అధికారిక వెబ్‌సైట్ www.hyderabadpolice.gov.in సందర్శించి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ ఇంటర్న్‌షిప్ ద్వారా నేర పరిశోధన, ట్రాఫిక్ మేనేజ్‌మెంట్, సోషల్ మీడియా పోలీసింగ్ వంటి అంశాలపై అవగాహన పెంచుకోవచ్చని పోలీస్ శాఖ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది.