అదే జరిగితే మోడీకి పదవీగండం: బోయిన్‌పల్లి వినోద్  

అదే జరిగితే మోడీకి పదవీగండం: బోయిన్‌పల్లి వినోద్  

బీజేపీకి ఈసారి సంపూర్ణ మెజార్టీ వచ్చే అవకాశం లేదని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మాజీ ఎంపీ బోయిన్ పల్లి వినోద్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి 272 స్థానాలు రాకపోతే మోడీ ప్రధాని అయ్యే అవకాశం లేదని అన్నారు. మోడీని అడ్డుకునేవాళ్లు సొంతపార్టీలోనే ఉన్నారని అన్నారు. అంతేకాదు.. ఈసారి బీజేపీ సొంతగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కష్టమేనని వినోద్ కుమార్ జోస్యం చెప్పారు. 

 

Read More ఏఐ ఆవిష్కరణలకు తెలంగాణ వేదిక: మంత్రి శ్రీధర్ బాబు

దేశవ్యాప్తంగా బీజేపీకి ఎదురుగాలి వీస్తుందని అన్నారు. ఆ పార్టీ పెద్దలకు కూడా ఈ విషయం తెలుసని చెప్పారు. అందుకే.. ఈ మధ్య ప్రధాని మోడీ ఫ్రస్ట్రేట్ అవుతున్నారని వినోద్ కుమార్ సెటైర్లు వేశారు. కాంగ్రెస్ గెలిస్తే రామాలయాన్ని కూల్చేస్తారని ప్రధాని ప్రచారం చేయడం ఆయన ఫ్రస్ట్రేషన్ కి నిదర్శమని విమర్శించారు. రామాలయాన్ని కూల్చే ప్రయత్నం ఎవరైనా చేస్తారా? అని వినోద్ ప్రశ్నించారు. మత భావోద్వేగాలు రెచ్చగొట్టి గెలవడం కోసమే మోడీ ఈ కామెంట్స్ చేశారని అన్నారు. ప్రధానిలో ఓటమి భయం కనిపిస్తోందని ఆయన తెలిపారు. 

 

ఇప్పుడు వినోద్ కుమార్ కామెంట్స్ సంచలనంగా మారాయి. 

3 రోజుల క్రితం అరవింద్ కేజ్రీవాల్ కూడా ఈసారి అమిత్ షా ప్రధాని అవుతారని అన్నారు. ఇప్పుడు.. వినోద్ కుమార్ కూడా మోడీ ప్రధాన అయ్యే అవకాశం తక్కువ అని చెప్పారు.

దేశంలో సర్వేలు కూడా బీజేపీకి ఎదురుగాలి వీస్తుందని చెబుతున్నారు. గతంలా మోడీ ఫ్యాక్టర్ పని చేయడం లేదని పలువురు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 2014 నాటి కంటే తక్కువ స్థానాలకు బీజేపీ పరిమితం అవుతుందని సర్వేల సారాంశం. ఎన్నికల తర్వాత బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే.. కొత్త మిత్రులను వెతుక్కోవాల్సి ఉంటుందని జోరుగా ప్రచారం జరుగుతోంది.

Related Posts