సినిమా నడుస్తుండగానే వర్షం.. తడిసి ముద్దయిన ప్రేక్షకులు.. వీడియో ఇదిగో!

సినిమా నడుస్తుండగానే వర్షం.. తడిసి ముద్దయిన ప్రేక్షకులు.. వీడియో ఇదిగో!

పంజాగుట్టలోని పీవీఆర్ సినిమా హాల్‌లో ఏకంగా బయట కురిసినట్టే వర్షం పడింది. సినిమా నడుస్తుండగానే పైకప్పు నుంచి నీరు కారడంతో ప్రేక్షకులు తడిసిపోయారు. దీంతో తీవ్ర అసౌకర్యానికి గురైన ప్రేక్షకులు సినిమా మధ్యలోనే బయటకు వెళ్లారు. టికెట్ డబ్బులు వెనక్కి ఇవ్వాలని ఆందోళనకు దిగారు.

హైదరాబాద్ పంజాగుట్టలో కురిసిన భారీ వర్షానికి పీవీఆర్ సినిమా థియేటర్లో వర్షం నీరు పడింది. కల్కీ మూవీని ఎంజాయ్ చేస్తున్న ప్రేక్షకులకు అకస్మాత్తుగా థియేటర్ పై కప్పు నుంచి నీటి చుక్కలు పడ్డాయి. బయట వర్షం పడుతుంటే థియేటర్లోకి నీళ్లు ఎలా వచ్చాయని ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు.

థియేటర్లో వర్షం నీరు పడుతుంటే నిర్వాహకులు మాత్రం షో నిలిపివేయలేదు. షార్ట్ సర్క్యూట్ జరిగి ఏదైనా జరగరాని ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు అంటూ మూవీ చూడడానికి వచ్చిన ప్రేక్షకులు థియేటర్ యాజమాన్యాలతో గొడవకు దిగారు.

Read More సురవరం సుధాకర్ రెడ్డిని కలిసిన మంద కృష్ణ మాదిగ

 

సినిమా చూసేవారు చూడవచ్చు, వెళ్లేవారు వెళ్లిపోవచ్చు అంటూ థియేటర్ యాజమాన్యం వెటకారపు సమాధానమిచ్చారు. దీంతో అసహనానికి గురైన ప్రేక్షకులు పోలీసులకు సమాచారం అందించారు. కాగా ఆదివారం సాయంత్రం సమయంలో నగరంలో పలుచోట్ల భారీ వర్షం కురిసింది.

Tags: