డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన ఇద్దరికి జైలు

విశ్వంభర, సూర్యాపేట: మద్యం సేవించి వాహనాలు నడిపి పట్టుబడిన నలుగురిలో ఒకరికి 4 రోజులు, ఇంకొకరికి 2 రోజుల జైలు శిక్ష, జరిమానా, మరో ఇద్దరికి జరిమానా సూర్యాపేట కోర్టు విధించినట్లు సూర్యాపేట పట్టణ ట్రాఫిక్ ఎస్సై సాయిరాం తెలిపారు. సూర్యాపేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోనీ పలు ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన నలుగురిని కోర్టులో హాజరుపర్చగా ఒకరికి 4 రోజుల జైలు శిక్ష, ఇంకొకరికి 2 రోజుల జైలు శిక్ష , ఒక్కొక్కరికి రూ.2,500 చొప్పున జరిమానా, మరో ఇద్దరికి కలిపి రూ.3,000 జరిమానా విధిస్తూ ప్రిన్సిపల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ గోపు రజిత తీర్పు వెల్లడించినట్లు ఎస్సై తెలిపారు. జిల్లా ఎస్పీ నరసింహ, ఆదేశాల మేరకు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే జరిమానాతో పాటు జైలుకు వెళ్లాల్సి ఉంటుందని ఈ సందర్భంగా హెచ్చరించారు.



