చేవెళ్ల మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీదే చైర్మన్ పీఠం

చేవెళ్ల మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీదే చైర్మన్ పీఠం

విశ్వంభర, చేవెళ్ల:-చేవెళ్ల మున్సిపల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకుంటుందని మాజీ ఎమ్మెల్యే కే.ఎస్. రత్నం ధీమా వ్యక్తం చేశారు. చేవెళ్ల మాజీ ఎంపీపీ విజయలక్ష్మి రమణారెడ్డి, నేతృత్వంలో గురువారం 18వ వార్డుకు చెందిన వివిధ పార్టీల నాయకులు బీజేపీలో చేరారు. తెలుగు శ్రీనివాస్, బురాన్ మహేష్, బంటు జనార్ధన్, బంగారు శివకుమార్, కావలి భార్గవ్, ఋషి, కుమార్, శివ, సాయి, గుడిసె మహేందర్, తుప్పరి నరేందర్, దాసరి వెంకటేష్, సాకలి మహేందర్ పార్టీలో చేరగా, ఈ కార్యక్రమానికి చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కే.ఎస్. రత్నం, సీనియర్ నాయకులు డాక్టర్ మల్గారి  వైభవ్ రెడ్డి, అత్తిలి అనంతరెడ్డి గుండన్నగారి వెంకట్ రెడ్డి, కేశపల్లి వెంకట్ రామ్ రెడ్డి,  హాజరయ్యారు. చేరిన నాయకులకు కమలం కండుగ కప్పి ఆహ్వానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కే.ఎస్. రత్నం మాట్లాడుతూ... ప్రజాసేవ, పారదర్శక పాలన లక్ష్యాలతో బీజేపీ ముందుకు సాగుతోందని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా ప్రయాణిస్తోందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు నేరుగా ప్రజలకు అందుతుండటమే పార్టీ బలమని వివరించారు. రాబోయే చేవెళ్ల మున్సిపల్ ఎన్నికల్లో ప్రతి కార్యకర్త సమన్వయంతో పనిచేసి చైర్మన్ పీఠాన్ని దక్కించుకొని బీజేపీ జెండాను ఎగరవేయాలని పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయిలో నిరంతర కృషితో పార్టీని విజయపథంలో నిలపాలని కోరారు. ఈ కార్యక్రమంలో శర్వలింగం, గోటూరి జయశంకర్ గౌడ్, పాండురంగారెడ్డి, అల్లాడ శ్రీనివాస్ రెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు.

Tags: